దేశ వ్యాప్తంగా ఇప్పుడు ‘మీ టూ’ఉద్యమం భారీ ఎత్తున కొనసాగుతున్నది.  మహిళలపై లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై ఆరోపణలు చేస్తూ..పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు.  ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు దర్శక, నిర్మాత, నటులు మాత్రమే కాదు ఇతర టెక్నీషియన్స్ కూడా గతంలో తమపై లైంగిక దాడులు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మద్య యాక్షన్ కింగ్ అర్జున్ తనని శారీరకంగా, మానసికంగా వేధించాలని చుశాడు అంటూ కన్నడ స్టార్ హీరోయిన్ శృతి హరిహరన్ చేసిన వ్యాఖ్యలు అటు కన్నడ ఇండస్ట్రీ లో ఇటు తమిళ ఇండస్ట్రీ లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. అయితే  శృతి హరిహరన్ వ్యాఖ్యలను ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ ఖండించారు.
Image result for arjun sruthi hariharan
గతంలో తనపై జరిగిన లైంగిక వేధింపులు అప్పుడే బయట పెడితే ఎవరు ఏంటో తెలిసేది..కానీ అలా చేయకుండా ఇప్పుడు మా నాన్న కెరీర్ సాఫిగా సాగిపోతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా తప్పని అన్నారు.  అంతే కాదు ఒకప్పుడు అర్జున్ చాలా మంచి హీరో అని ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇలా వ్యాఖ్యానించడం ఆమె పరిస్థితి ఏంటో తెలుస్తుందని అన్నారు.  ఇదిలా ఉంటే..ప్రముఖ నటి ఖుష్బు అర్జున్ కి క్లిన్ చీట్ ఇచ్చింది.  ఇండస్ట్రీలో గత 35ఏళ్లుగా అర్జున్ నాకు తెలుసు. తనతో చాలా సినిమాలు చేశాను.
Related image
ఎప్పుడు కూడా ఆయన వ్యవహారంలో నాకు తప్పు అనిపించలేదే...పైగా అందరితో చాలా కలివిడిగా ఉంటూ..ఎంతో గౌరవంగా ఉంటారని అన్నారు. టువంటి వ్యక్తిపై ఇటువంటి విమర్శలు రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అర్జున్ ని హీరోలా చూసే తన కూతుళ్లపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయి. ఓ వ్యక్తిపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించాలి. తన నిజాయతీ నిరూపించుకోవడానికి ఓ అవకాశం ఇవ్వాలి. ఎవరూ ఈ విషయంలో తొందరపడొద్దు అంటూ తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది ఖుష్బూ. 


మరింత సమాచారం తెలుసుకోండి: