రాజమౌళి భారీ మల్టీ స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు రంగం సిద్ధం అవుతున్న నేపధ్యంలో ఈసినిమాకుసంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ లుక్ పై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మింపబడుతున్న ఈమూవీకి సంబంధించి ఒక కీలక అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలకు లీక్ అయింది. 
 కళ్ళు చెదిరే పారితోషికం
ఈసినిమా కోసం రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ ల వద్ద నుండి  200 రోజుల కాల్ షీట్స్ తీసుకున్నట్లు టాక్. అవసరం అయితే ఇంకా అదనపు రోజుల కాల్ షీట్స్ ఇవ్వవలసి ఉంటుందని సూచన ప్రాయంగా రాజమౌళి చరణ్ జూనియర్ లకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో 2020 వరకు ఎన్టీఆర్ రాంచరణ్ లు ‘ఆర్ఆర్ఆర్’ కోసమే అంకితం అయిపోతున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి వారికి పారితోషికం కాకుండా లాభాలలో వాటాను ఇవ్వబోతున్నట్లు సమాచారం.
అంతుచిక్కడం లేదు
అయితే అనుకోని పరిస్థుతులు ఏమైనా ఎదురైనా చరణ్ జూనియర్ లు నష్టపోకుండా వారిద్దరికీ చెరొక 50 కోట్ల పారితోషికం గ్యారంటీని రాజమౌళి ఇచ్చినట్లు టాక్.అదేవిధంగా రాజమౌళి కూడ ఈసినిమా పూర్తి అయ్యేంత వరకు ఎటువంటి పారితోషికం తీసుకోకుండా కేవలం తన టీమ్ మెయిన్ టైనెన్స్ కోసం ఈమూవీ మొదలైన దగ్గర నుండి నెలకు 10 లక్షలు తీసుకోబోతున్నట్లు సమాచారం. దీనితో రాజమౌళి తీయబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ లో ఒక ‘ఆర్’ రెమ్యూనరేషన్ మిస్ అయింది అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 
రాంచరణ్, ఎన్టీఆర్ 200 రోజుల పాటు
సుమారు 600 కోట్ల బిజినెస్ టార్గెట్ గా నిర్మింపబడుతున్న ఈమూవీ లాభాలను రాజమౌళి చరణ్ జూనియర్ లతో పాటు నిర్మాత దానయ్యకు కూడ దక్కవలసిన నేపధ్యంలో లాభాలలో ఎవరికీ ఎంత వాటా వస్తుంది అన్న విషయమై రాజమౌళి చాల ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈసినిమా కథకు సంబంధించి లీకులు వస్తున్నప్పటికీ కొందరు బాక్సింగ్ నేపథ్యం ఉన్న కథ అని మరికొందరు స్వాతంత్ర పోరాటానికి సంబందించి కథ అని అంటున్నప్పటికీ ఈమూవీలో నటించే నటీనటులకు రాజమౌళి పూర్తి కథను చెప్పకుండా కేవలం వారి పాత్ర వరకు చెపుతూ ఈసినిమా విడుదల అయ్యేవరకు ఈసినిమా కథకు సంబంధించిన సస్పెన్స్ కొనసాగించాలని జక్కన్న ధృఢ నిశ్చయంతో ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: