‘అరవింద సమేత’ తో కలెక్షన్స్ విషయంలో జూనియర్  స్థాయి మరో మెట్టు ఎక్కి తన స్టామినా ప్రదర్శింపబడుతుంది అని అందరూ భావించారు. దీనికితోడు త్రివిక్రమ్ డైరక్షన్ క్రేజ్ కుడా కలసి రావడంతో ఈమూవీకి విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. దసరా సెలవలు కూడా కలసి రావడంతో పాటు ఈమూవీకి పాజిటివ్ టాక్ రావడంతో జూనియర్  ఆశిస్తున్న రికార్డు స్థాయి హిట్ గ్యారెంటీ అన్న అంచనాలు కలిగాయి.
Jr NTR in Aravinda Sametha
అయితే జరిగింది వేరు నాన్ ‘బాహుబలి’ రికార్డు విషయంలో ముందే ఆశలు ఆవిరైపోగా వందకోట్ల షేర్ కూడా సాధ్యంకాదని తాజాగా తేలిపోయింది. ఇప్పుడసలు ‘అరవింద సమేత’ బ్రేక్ ఈవె‌న్‌ అయినా వస్తుందా అన్నసందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి.  ప్రస్తుతం ‘అరవింద సమేత’ షేర్ నామ మాత్రంగా వస్తోంది. 
ఆగ‌ని
కోట్లు పోయి లక్షలకు షేర్ పడిపోయింది అని వార్తలు వస్తున్నాయి. మొన్నటిరోజున ఈమూవీ షేర్ 20 లక్షల లోపే అంటున్నారు.  గత సంవత్సరం విడుదల అయిన తారక్ ‘జై లవకుశ’ కూడా బ్రేక్ ఈవెన్‌ కు కొంచెం దూరంలో ఇలాగే  ఆగిపోయిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్ ను చేరుకోవడంలో సక్సెస్ సాధించిన “అరవింద సమేత” కలెక్షన్స్ విషయంలో  పూర్తిగా చతికిలపడి ప్రస్తుతం ధియేటర్స్ రెంట్ కు కూడ సరిపోని స్థితిలో ‘అరవింద’ కలక్షన్స్ ఉన్నాయి అంటున్నారు. 
ఆగ‌ని
ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ ను బట్టి తొలివారం చివరికి బ్రేక్ ఈవెన్ వచ్చి రెండవ వారం నుండి బయ్యర్లు లాభాలలోకి వెళ్ళిపోతారు అనుకుంటే సీన్ రివర్స్ కావడం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ బయ్యర్లు అందరూ నష్టాలు లేకుండా బయట పడాలి అంటే ఇంకా 18 కోట్లు రావాలి అంటున్నారు. ప్రస్తుతం ఈవారం విడుదల అవుతున్న సినిమాల నుంచి ఏమాత్రం పోటీ ‘అరవింద’ కు లేకపోయినా ఈమూవీని మరొక సారి చూడటానికి సాధారణ ప్రేక్షకులు ఇష్టపడని పరిస్థుతులలో ఈస్థితి వచ్చింది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: