ఆవేశానికి చిరునామాగా కొనసాగుతూ ఎప్పుడు రగిలిపోతు కనిపించే సంచలన నటుడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కు పొంచి ఉన్న ప్రమాదం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నాన్ని సినీరాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్న నేపధ్యంలో ఈ విషయమై స్పందిస్తూ ఆదాడిని ఖండించాడు పోసాని.
పవన్‌కి కూడా ముప్పు ఉంది
ఈస్పందన మధ్య మాటలలో పోసాని పవన్ ప్రస్తావన తీసుకు వస్తూ ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు కూడ ప్రమాదం పొంచి ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని ఈకామెంట్స్ చేసాడు. జగన్ పై దాడికి సంబందించిన టివి చర్చలో పాల్గొంటూ పోసాని పవన్ పై ప్రశంసలు కురిపించాడు. 
పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే
పవన్ ఒప్పుకుంటే ఇండియాలో ఎవ్వరికి ఇవ్వనంత రెమ్యునరేషన్ ఇచ్చి తాను పవన్ డేట్లు లాక్ చేస్తాను అని అంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగితే ఏడాదికి సులభంగా 150 కోట్లు  సంపాదిస్తాడు అంటూ పోసాని కామెంట్స్ చేసాడు. సినిమాల్లో కొనసాగుతూ  పవన్ కోరుకున్న విధంగా లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు అని కానీ అన్నింటిని విడిచిపెట్టి తాను సమాజానికి సేవచేయాలి అనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని పోసాని కామెంట్స్ చేసాడు. 
 పవన్ షూటింగ్‌లో ఉంటే
అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు అందుకు పవన్ మినహాయింపు కాదు అంటూ   పవన్ నోటి నుంచి ఓమాట వచ్చిందంటే అందులో ఎంతోకొంత వాస్తవం ఉంటుందని తన అభిప్రాయం అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించాడు. పవన్ ఈమధ్య తనకు ప్రాణ హాని ఉందని ఓపెన్ గానే చెప్పిన విషయాన్ని గుర్తుకు చేస్తూ ఈవిషయంలో కూడా ఎంతోకొంత నిజం ఉంటుంది అని తన అభిప్రాయం అంటూ పోసాని  పవన్ కు ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రతకల్పించే ఆలోచన చేయాలని సలహాలు ఇస్తున్నాడు. దీనితో పవన్ పై పోసాని చేసిన కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: