‘గీత గోవిందం’ సక్సస్ తో అల్లు అరవింద్ కు చిన్నహీరోలతో సినిమాలు తీస్తే లాభాలు సునామీలా  ఎలా వచ్చిపడతాయో అర్ధం అయింది. దీనితో అరవింద్ తన దృష్టి అంతా ప్రస్తుతం చిన్న సినిమాల పై పెట్టినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతుల నేపద్యంలో ఇద్దరు క్రియేటివ్ దర్శకులు అరవింద్ ను నమ్ముకుని గీతాఆర్ట్స్ బ్యానర్ లో బందీలుగా మారి బయటకు రాలేక వేరే మార్గం లేక సతమతమౌతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఆ ఇద్దరి దర్శకులలో మొదటి వ్యక్తి శ్రీకాంత్ అడ్డాల క్రియేటివ్ దర్శకుడుగా పేరు గాంచిన శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ పరాజయం తరువాత ఎంతో ఆలోచించి తయారు చేసిన కథ ఇప్పుడు అల్లు అరవింద్ ఆఫీసులో చిక్కుకుందని టాక్. ఇప్పటికే ఈకధకు అరవింద్ అనేక మార్పులు చేర్పులు చేయడంతో ఆసలహాలు అన్నీ పాటిస్తూ శ్రీకాంత్ అడ్డాల చాల ఓపికగా ఈకథను తయారు చేసినా అరవింద్ ఇంకా ఈకథకు పూర్తిగా ఓకె చేయలేదు అని అంటున్నారు.

వాస్తవానికి యంగ్ హీరో శర్వానంద్ డేట్స్ అరవింద్ దగ్గర ఉన్నా శ్రీకాంత్ అడ్డాల కథ నచ్చినా ఇంకా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పై అరవింద్ సాహసం చేయలేకపోతున్నాడు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘బొమ్మరిల్లు’ మూవీతో టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోతాడు అని అనుకున్న భాస్కర్ కూడ అరవింద్ బాదితుడుగా మారాడు అంటూ జోక్స్ పడుతున్నాయి. 

గతకొన్ని సంవత్సరాలుగా సినిమా దర్శకత్వానికి దూరంగా ఉన్న భాస్కర్ ‘బొమ్మరిల్లు’ మూవీ స్థాయిలో ఒక ఫ్యామిలీ ఎటాచ్ మెంట్స్ కు సంబంధించిన ఒక సున్నితమైన కథను వ్రాసి అరవింద్ ను మెప్పించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ ‘RX – 100’ లాంటి సినిమాలను యూత్ ఇష్టపడుతున్న నేపధ్యంలో కుటుంబ బంధాల కథలను జనం చూడరు అన్న భయంతో అరవింద్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ప్రాజెక్ట్ ను కూడ పక్కకు పడేసినట్లు టాక్. దీనితో అరవింద్ దగ్గర చిక్కుకున్న తమ కథల భవిష్యత్ తేలక మరొకచోట అవకాశాలు రాక ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ క్రియేటివ్ దర్శకులు ఇద్దరూ ప్రస్తుతం తీవ్ర అయోమయంలో ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: