ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో జూనియర్ పాత్ర ఈమూవీలో ఏదోవిధంగా ఉండాలి అన్న తాపత్రయంతో దర్శకుడు క్రిష్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు బాలయ్య నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈమూవీకి జరుగుతున్న భారీ బిజినెస్ రీత్యా ఈమూవీకి అత్యధిక ఓపెనింగ్స్ రావాలి అంటే ఎట్టి పరిస్తుతులలోను జూనియర్ ను ఎదో విధంగా ఈ ప్రాజెక్ట్ లో అంతర్భాగం చేయాలి అన్న ఒత్తిడి ఈమూవీ బయ్యర్ల నుండి రోజురోజుకు పెరిగిపోతూ ఉండటంతో ఈవిశాయల పై మరొకసారి ఆలోచనలు చేయమని క్రిష్ బాలయ్య పై మరోసారి రాయబారాలు నడుపుతున్నట్లు టాక్. 

ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించి జూనియర్ కు అంటూ ఒక పాత్రను సృష్టించలేకపోయినా కనీసం వాయిస్ ఓవర్ విషయంలో అయినా జూనియర్ ను ఒప్పించడానికి బాలయ్య స్వయంగా రంగంలోకి దిగితే బాగుంటుంది అని క్రిష్ ఆలోచన అని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈమూవీలో హరికృష్ణ కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్ హీరికృష్ణ పాత్రను పోషిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు మళ్ళీ జూనియర్ ప్రస్తావన ఎందుకు అని బాలయ్య అభిప్రాయ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే జూనియర్ వాయిస్ చాల గంభీరంగా అద్భుతంగా ఉండే నేపధ్యంలో జూనియర్ వాయిస్ ఎన్టీఆర్ బయోపిక్ కు అన్ని విధాల హైక్ క్రియేట్ చేస్తుంది అని క్రిష్ రకరకాలుగా బాలయ్యకు నచ్చచెపుతున్నట్లు సమాచారం. దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ వాయస్ వినిపిస్తే జూనియర్ అభిమానుల సందడితో పాటు కలక్షన్స్ విషయంలో కూడ జూనియర్ అభిమానుల అండ దొరుకుతుంది అని క్రిష్ అభిప్రాయం అని అంటున్నారు. 

ఇప్పుడు ఈ పంచాయతి బాలయ్య వద్ద వరకు వెళ్ళడంతో బాలయ్య తన పట్టు సడలించి జూనియర్ ను ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వాయిస్ అవరకు ఓవర్ కు ఒప్పిస్తాడా లేదంటే తన సహజ సిద్ధమైన ఇగోను కొనసాగిస్తూ బాలయ్య ఈ బయోపిక్ విషయంలో జూనియర్ ప్రస్తావన లేకుండానే ముగిస్తాడా అన్న ఆతృత నందమూరి అభిమానులలో పెరిగిపోతోంది. అయితే ఈసినిమా ద్వారా 100 కోట్ల కలక్షన్స్ పై బాలయ్య కన్ను వేసాడు కాబట్టి ఏదోవిధంగా క్రిష్ ఒత్తిడికి బాలయ్య ఒప్పుకుంటాడు అని జూనియర్ అభిమానులు ఆశిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: