ప్రేక్షకులు ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 18న ఈమూవీ తొలి షాట్ చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథతో పాటు టైటిల్ కూడ రాజమౌళి ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. 
Rajamouli Multi Starrer Official Announcement - Sakshi
ఐదు అక్షరాల పేరుతో ఉండే ఈ టైటిల్ తెలుగు తమిళ హిందీ భాషల ప్రేక్షకులకు సులువుగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించి బాలీవుడ్ సినిమాల కథలు ప్రస్తావనకు వస్తున్న నేపధ్యంలో ఆరూమర్స్ కు చెక్ పెట్టే దిశలో ‘ఆర్ ఆర్ ఆర్’ కథకు సంబంధించిన స్టోరీ లైన్ ను వివరించడంతో పాటు ఈమూవీ టైటిల్ ను కూడ ఈమూవీ ప్రారంభం రోజునే ప్రకటిస్తారని టాక్. 
Ram Charan Teja, SS Rajamouli and Junior NTR
బాలీవుడ్ మీడియా ఇప్పటికే రాజమౌళి తీయబోతున్న ఈమల్టీ స్టారర్ మూవీ కథ బాలీవుడ్ ఫ్లాప్ మూవీ ‘గుండె’ కథను పోలి ఉంటుంది అని కొన్నిరోజులు ఆతరువాత అక్షయ కుమార్ నటించిన ‘బ్రదర్స్’ మూవీకి అనుసరణగా ఉంటుంది అని వార్తలు వ్రాస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ మీడియా ఈమూవీ కథ ‘థూమ్’ సిరీస్ ను పోలి ఉంటుంది అంటూ మరో కొత్త ప్రచారానికి తెర తీసింది. 
రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్…టీజర్‌ రచ్చరచ్చే..!!
ఈమూవీలో నటిస్తున్న చరణ్ జూనియర్ లలో ఒకపాత్ర పోలీసు పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన అన్నదమ్ముల కథకు సంబంధించిన పోలీసు స్టోరీలను లింక్ చేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ కథ పై మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఇలాంటి రూమర్లు ఎక్కువ కాలం కొనసాగితే ఈమూవీకి నెగిటివ్ ప్రచారం జరిగే ఆస్కారం ఉంది అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి ఈమూవీ ప్రారంభం రోజునే ఈమూవీ స్టోరీ లైన్ ను అధికారికంగా తెలియచేసి అందరికీ ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడని సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: