‘బిచ్చగాడు’ సినిమాతో హీరో విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకులలో ఏర్పడిన క్రేజ్ చూసి ఆమూవీ తరువాత విజయ్ ఆంటోనీ తెలుగు సినిమా మార్కెట్ లో లీడింగ్ హీరో అయిపోతాడు అని భావించరు అంతా. దీనికితోడు తన తెలుగు సినిమాల డబ్బింగ్ ప్రమోషన్ ను విజయ్ ఆంటోనీ దగ్గర ఉండి చూసుకోవడంతో పాటు అతడికి తెలుగు ప్రేక్షకులలో అనూహ్యంగా ఏర్పడిన క్రేజ్ రీత్యా   అతడి  సినిమాలు అన్నీ వరుసపెట్టి తెలుగులో బాగానే విడుదలయ్యాయి. 
Vijay Antony
కానీ ఏఒక్క సినిమా కూడా సక్సస్ కాకపోవడంతో ప్రస్తుతం ఇతడి పరిస్థితి అయోమయంలోకి వెళ్లి పోయింది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతున్న వార్తల ప్రకారం   ఇతడి లేటెస్ట్ సినిమా ‘రోషగాడు’ తెలుగు హక్కులకోసం కేవలం కోటిన్నరకు మాత్రమే కొంటామని అనడం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది.  
VijayAntony.JPG
కోటిన్నరకు ఈమూవీ రైట్స్ అమ్ముడుపోయాయి అని వార్తలు రావడంతో ఒక ప్రముఖ ఛానల్ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను కూడ కోటిన్నరకు కావాలి అని అడగడంతో విజయ్ ఆంటోనీ ఊహించని షాక్ లో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక డబ్బింగ్ సినిమాను మార్కెట్ చేయాలి అన్న 50 లక్షలు పబ్లిసిటీకి కావలసిన నేపధ్యంలో అంత చౌకగా ఈమూవీని అమ్ముకునే కన్నా తానే ఉంచుకుని ఈమూవీకి మంచి పబ్లిసిటీ చేయాలి అని విజయ్ అంటోనీ ప్లాన్ అనిటాక్. 
vijayantony
అయితే ఈ తమిళ హీరో ఈ సాహసం చేసినా మంచి థియేటర్స్ ఈసినిమాకు దొరుకుతాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన నేపధ్యంలో అలాంటి అదృష్టం ఎదో తనకి ఉంది అన్న నమ్మకంతో ఈ తమిళ హీరో ఈ సాహసం చేస్తున్నాడనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: