క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రవర్తించిన తీరుకు నాగచైతన్య అభిమానులు తీవ్ర నిరాశకు గురై విజయ్ దేవరకొండ పై అసహనాన్ని పెంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
నా దగ్గర డబ్బుల్లేకుంటే ఆయనే కట్టారు
చందు మొండేటి దర్శకత్వంలో ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈమూవీకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎలాంటి హంగామా లేకుండా చాల కూల్ గా జరిగింది అని చైతన్య అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. 
మ్యాడీ సర్ మేము మీ అభిమానులం
దీనికితోడు ఈ ఫంక్షన్ కు చాల ఆలస్యంగా విజయ్ దేవరకొండ రావడం చైతూ అభిమానులను మరింత ఆశ్చర్య పరిచింది. అంతేకాదు విజయ్ నాగచైతన్య గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఎప్పుడో తాను కీరవాణి దగ్గర తీసుకున్న డబ్బు అప్పు గురించి తన ఫ్లాష్ స్టోరీ అంతా చెప్పి విసిగించడం చైతన్య అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. 
చై షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్విన విధానంలోనే మస్తు చిల్ రిలాక్సడ్ వైబ్ ఉంటుంది
ఇది చాలదు అన్నట్లుగా ‘సవ్యసాచి’ మూవీ పై అంచనాలు పెంచవలసిన చైతన్య తాను గతంలో కొన్ని తప్పులు చేసాను అంటూ కామెంట్స్ చేసి ఈసినిమాకు సంబంధించిన  వివరాలను దర్శకుడు చందు మొండేటి చేత చెప్పించడంతో చైతన్యకు ‘సవ్యసాచి’ పై అనుమానాలు ఉన్నాయా అన్న సందేహాలు చైతూ అభిమానులలో కలుగుతోంది. దీనితో ఈవారం విడుదల కాబోతున్న ‘సవ్యసాచి’ రిజల్ట్ గురించి చైతు అభిమానులకు కూడ కొన్ని సందేహాలు ఏర్పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: