తెలుగు ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్లుగా నటించి అందాల భామలు తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే రమ్యకృష్ణ, నదియా, మీనా, సుహాసిని లాంటి హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అమ్మ, వదిన,అత్త పాత్రల్లో నటిస్తున్నారు.  తాజాగా వీరి లీస్ట్ లో మరో హీరోయిన్ చేరబోతుంది. ఎగిరే పావురమా, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీగారు, పవిత్రప్రేమ, శివ పుత్రుడు వంటి చిత్రాలతో నటిగా మంచి పాపులారిటీ సంపాదించారు లైలా.

2006లో వ్యాపారవేత్త మెహ్‌దిన్‌ని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది.   సొట్ట బుగ్గలతో ఎప్పుడూ నవ్వుతూ... తన అందంతో కుర్రకారు మదిని దోచింది. అప్పట్లో గ్లామరస్ పాత్రల్లోనూ మెప్పించిన లైలా.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణ రాష్ట్రాల నుంచి మళ్లీ చాలా ఆఫర్స్‌ వస్తున్నాయి. కానీ, మంచి రోల్‌తో కమ్‌బ్యాక్‌ చేయాలని ఎదురుచూస్తున్నాను.
Image result for actress laila
నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అయితే ఇంకా సరదాగా ఉంటుంది.  తనకు నచ్చిన పాత్రలు వస్తే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో లైలా ఏ సినిమాతో మెప్పిస్తుందో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: