హాస్య సినిమాల హీరోగా రెండుదశాబ్దాల పాటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన రాజేంద్రప్రసాద్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఏకంగా కోలీవుడ్ టాప్ హీరో విజయ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ లకు సవాల్ విసరబోతు ఉండటం అత్యంత ఆశ్చర్య కరంగా మారింది. 
Telugu director Ravi Babu,Ravi Babu,Piglet
నటుడుగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి ఆతరువాత విలన్ గా మారి అక్కడ కూడ పెద్దగా రాణించలేక పోయిన రవిబాబు దర్శకుడుగా మారి ‘అల్లరి’ తో మొదలై ‘అవును’ వరకు వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య తీసిన   తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడతను. ‘అవును-2’ ఫెయిల్ అయిన తరువాత ఇక లాభం లేదు అనుకుని ఏకంగా పంది పిల్లను హీరోగా చేసి తీసిన సినిమా ‘అదుగో’.

ఈమూవీకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం జరగడం వల్ల దసరాకు రిలీజ్ చేద్దామనుకున్న ఈమూవీ ఎట్టకేలకు దీపావళికి వస్తోంది. నవంబరు 7న ‘అదుగో’ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. అయితే ఆశ్చర్యకరంగా ఈమూవీ విజయ్ సర్కార్ అమితాబ్ అమీర్ ఖాన్ ల మూవీలు సర్కార్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి భారీ సినిమాలతో రవిబాబు పంది పిల్లతో చేస్తున్న సాహసం ‘అదుగో’ విడుదల కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
Adhugo Movie Song Lyrics | Ravi Babu | Anilyrics
ఈమూవీలో నటిస్తున్న పంది పిల్లను రవిబాబు విదేశాల నుంచి తెప్పించాడు. ఈమూవీలోని పంది పిల్లకు ‘బంటి’ అనే పేరు పెట్టాడు. ఈమూవీలో పంది పిల్ల బంటి మనసులోని మాటలకు రాజేంద్ర‌ప్ర‌సాద్ గాత్ర‌దానం చేశాడు. త్రీడీ యానిమేష‌న్‌ చిత్రంగా ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి ప్ర‌య‌త్నం ఎవరు చేయని నేపధ్యంలో బంటీకి రాజేంద్రప్రసాద్ మాటలు పెట్టి ఏకంగా విజయ్ అమితాబ్ ల సినిమాలను కూడ లెక్క చేయకుండా దీపావళికి విడుదల చేయడం రవిబాబు సాహసం అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: