‘బాహుబలి’ మూవీతో ఇండియన్ స్టార్ సెలెబ్రెటీగా మారిపోయిన రాజమౌళి మరోరెండు రోజులలో రాబోతున్న నవంబర్ నెలను చూసి ఖంగారు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈనెలలో విడుదలకాబోతున్న మూడు భారీ సినిమాలు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈమూడు సినిమాల గురించి చర్చలు జరుగుతున్న నేపధ్యంలో ఈమూడు సినిమాలలో ఎదో ఒకటి ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అంటూ బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. 
Rajamouli's second magnup opus
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ కాస్త డల్ గా కనిపిస్తున్నా వచ్చేనెల విడుదల కాబోతున్న మూడు సినిమాల మధ్య జరగబోతున్న పోటీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈమూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ ఆసినిమాలకు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్ లో టాప్ హీరోల సినిమాలతో అత్యంత భారీగా బిజినెస్ జరిగింది. ముందుగా ఈమూడింటిలో పేర్కొనవలసింది విజయ్ మూవీ ‘సర్కార్’. 

దేవసేనను గుర్తించని ప్రభాస్ రాజమౌళిలు !
అత్యంత భారీ అంచనాల మధ్య దీపావళిని టార్గెట్ చేస్తూ వచ్చేనెల 6న విడుదల కాబోతున్న ఈమూవీ ఇతర రాష్ట్రాల్లో ‘బాహుబలి 2’ సెట్ చేసిన రికార్డులను ఇది బీట్ చేస్తుందనే  అంచనాలు ఉన్నాయి. ఈసినిమా విడుదలైన కేవలం రెండు రోజుల గ్యాప్ తో అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ నటించిన పీరియాడికల్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’  వచ్చేస్తుంది. 250 కోట్లకు పైగా పెట్టుబడితో హిందీలో ‘బాహుబలి’ ని తలదన్నే రీతిలో ఈమూవీని తీసారని ఈమూవీతో ‘బాహుబలి 2’ రికార్డులు చెరిగిపోవడం ఖాయం అంటూ బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. 

దేవసేనను గుర్తించని ప్రభాస్ రాజమౌళిలు !
ఈరెండు సినిమాలు చాలవు అన్నట్లుగా దక్షిణాది సినిమారంగ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా ప్రచారంలో ఉన్న ‘2.0’ సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్ టార్గెట్ తో వచ్చే నెలాఖరులో విడుదల కాబోతోంది. ఈమూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఏదో ఒకటి ‘బాహుబలి’ రికార్డులను దాటుతుంది అని అంచనాలు వస్తున్న నేపధ్యంలో రాజమౌళి ఇంకా తన ‘ఆర్ ఆర్ ఆర్’ మొదలు పెట్టకుండానే తన రికార్డులు తుడిచి పెట్టుకుపోతాయా అన్న అసహనంలో ఉన్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: