నాగచైతన్య వెంకటేష్ లు కలిసి నటిస్తున్న మూవీ ‘వెంకీమామ’ రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 12వ తారీఖు నుండి ప్రారంభం కాబోతోంది. చైతన్య కెరియర్ లో మొట్టమొదటిసారి తన మేనమామ వెంకటేష్ తో కలిసి నటించబోతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రారంభం కాకుండానే ఈమూవీ పై అంచనాలు అప్పుడే ప్రారంభం అయిపోయాయి. 

డైరెక్టర్ కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ కథ ఒక డిఫరెంట్ స్టోరీ అని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో లీక్ అవుతున్న వార్తల ప్రకారం ఈసినిమాలో మామ అల్లుళ్ళ పాత్రలలో నటిస్తున్న చైతన్య వెంకటేష్ లకు జ్యోతిష్యం అంటే విపరీతమైన పిచ్చి అని తెలుస్తోంది. 
Naga Chaitanya
ఈసినిమాలో బేసిక్ ప్లాట్ అంతా జ్యోతిష్యం చుట్టూ తిరిగే నేపధ్యంలో జ్యోతిష్యం మనుషుల పై చూపించే ప్రభావంతో పాటు గ్రహాలు అనుకూలించకపోవడంతో ఈసినిమా కథలో మామా అల్లుళ్ళ మధ్య విభేదాలు వస్తాయట. అంతా హాస్యంతో నడిచే ఈ కథ అందరికీ నచ్చుతుంది అన్న అభిప్రాయంలో దర్శకుడు బాబి ఉన్నట్లు సమాచారం. 
Venkatesh-Naga Chaitanya's Venky Mama to launch on July 11th
ఈ సినిమాలో హ్యోమా ఖురేషీ రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  సురేష్ ప్రొడక్షన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోన ఫిలిం కార్పోరేషన్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తు వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు ఈమూవీని రెడీ పెట్టాలి అన్న ఉద్దేశ్యంలో నిర్మాతలు ఉన్నట్లు టాక్. ఈవారం విడుదల కాబోతున్న ‘సవ్యసాచి’ అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే ఆ ట్రాక్ ను కొనసాగించడానికి చైతన్య ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని ఎంచుకున్నాడు అని అనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: