క్రితం సంవత్సరం వరకు దిల్ రాజ్ ఏది పట్టుకుంటే అది బంగారం అనీ సినిమా కథలను జడ్జి చేయడంలో దిల్ రాజ్ కు ఉన్న తెలివి మరి ఏనిర్మాతకు లేవు అంటూ ఓపెన్ గానే దిల్ రాజ్ పై పొగడ్తలు కురిపించేవారు. అలాంటిది ఈ ఏడాది దిల్ రాజ్ నిర్మిస్తున్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్న నేపధ్యంలో దిల్ రాజ్ తెలివితేటలు ఏమైపోయాయి అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఈ ఏడాది దిల్ రాజ్ బ్యానర్ నుండి వచ్చిన ‘లవర్’ ‘శ్రీనివాస కళ్యాణం’ లు ఘోరమైన ఫ్లాప్ లుగా మారితే దసరాకు విడుదలైన ‘హలో గురూ’ సైతం దిల్ రాజ్ నమ్మకాన్ని బాగా దెబ్బ తీసింది. ఈపరిస్థుతుల నేపధ్యంలో హ్యాట్రిక్ హిట్ల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న ‘ఎఫ్-2’ కు సరైన హైప్ మార్కెట్ వర్గాలలో ఏర్పడక పోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 
Dil Raju. YouTube
విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్‌ల క్రేజీ కాంబినేషన్లో ఈ మూవీ షూటింగ్ జర్పుకుంటూ ఉన్నా  దీనికి బయ్యర్లలో బజ్ అంతంతమాత్రంగానే రావడం దిల్ రాజ్ కు ఊహించని షాక్ అని అంటున్నారు. ‘ఎఫ్-2’ అనే టైటిల్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే క్యాప్షన్ తో రూపొందింపబడుతున్న ఈమూవీ షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ ఫొటోలను చూస్తే  దిల్ రాజు బేనర్లో మరో రొటీన్ సినిమా తయారవుతోందన్న అభిప్రాయం బయ్యర్లలో ఏర్పడుతోంది అని అంటున్నారు. 
varun-tej-venkatesh-f2-movie-launch-6
దిల్ రాజ్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకం కూడా బాగా బయ్యర్లలలో తగ్గిపోవడంతో ‘ఎఫ్-2’ పై పెద్దగా అంచనాలు పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు అని టాక్. దీనికితోడు ఈసినిమాకు పోటీగా సంక్రాంతికి రామ్ చరణ్ బోయపాటి మూవీ ‘యన్.టి.ఆర్’ బయోపిక్ లు కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈమూవీ రిజల్ట్ గురించి దిల్ రాజ్ తో పాటు వెంకటేష్ వరుణ్ తేజ్ లు కూడ ఆందోళన పడుతున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: