రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ తో జూనియర్ చరణ్ తో తీయబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభానికి సంబంధించన అధికారిక సమాచారాన్ని విడుదల చేసారు. ఈమూవీ ఈనెల 11వ తారీఖు ఉదయం 11.గంటల 11.నిముషాలకు ప్రారంభం కాబోతోంది. దేవుడు పై ముహూర్తాల పై పెద్దగా నమ్మకం లేని రాజమౌళి ఈసారి తన పద్ధతి మార్చి తన ‘ఆర్ ఆర్ ఆర్’  కు ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకుని ప్రారంభించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
ముగ్గురు హీరోయిన్లు?
1920 కాలంనాటి కథను ఆధారంగా తీసుకుని నిర్మించబోతున్న ఈమూవీకి సుమారు 250 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ‘బాహుబలి’ రికార్డులతో పోటీపడే విధంగా నిర్మించబోతున్న ఈమూవీ ఇంకా అధికారికంగా ప్రారంభించకుండానే ఈమూవీ పై కొందరు ప్రచారంలోకి తీసుకు వస్తున్న నెగిటివ్ సెంటిమెంట్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
Is That A Good Number Sentiment For #RRR?
టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి నవంబర్ 11వ తారీఖు పెద్దగా కలిసిరాని రోజు అని కామెంట్స్ చేస్తూ దానికి తగ్గట్లుగా కొన్ని ఉదాహరణలు కూడ ఉదాహరిస్తున్నారు. 2011 నవంబర్ 11న హీరో సిద్ధార్ద్ నటించిన ‘ఓమై ఫ్రెండ్’ విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారింది. ఇక 2015 నవంబర్ 11న అఖిల్ మొట్టమొదటి సినిమా ‘అఖిల్’ అత్యంత భారీ అంచనాలతో మొదలై భారీ ఫ్లాప్ గా మారింది.  ఇదే డేట్ ను అనుసరిస్తూ 2016 నవంబర్ 11 విడుదలైన నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడ ఫ్లాప్ ముద్రను తెచ్చుకుంది.
రూ. 300 కోట్ల భారీ బడ్జెట్
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి అదేవిధంగా అనేకమంది హీరోలకి నెగిటివ్ రిజల్ట్ ను తెచ్చిపెట్టిన నవంబర్ 11 రాజమౌళికి కలిసి వస్తుందా ? అనుమానాలు కొందరు వ్యక్తప పరుస్తున్నారు. అయితే జాతకాలను ముహూర్తాలను పట్టించుకోని రాజమౌళి ప్రత్యేకంగా ఈవిషయాలను పట్టించుకొకపోయినా ఈమూవీని అత్యంత భారీ రేట్లకు కొనబోయే బయ్యర్లు ఎంతోకొంత పట్టించుకుంటారు అన్నది నిజం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: