‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత టాప్ హీరోలు చాలామంది సుకుమార్ తో సినిమాలు చేయాలని భావించినా ముందుగా ఏర్పరుచుకున్న కమిట్ మింట్స్ వల్ల సుకుమార్ తో వెంటనే సినిమాలు చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ సుకుమార్ ల మధ్య మూవీ ప్రాజెక్ట్ ఖరారు అయినా ఆమూవీకి సంబంధించిన కథ ఫైనల్ కాకపోవడంతో సుకుమార్ మహేష్ కోసం వ్రాసిన కథను విజయ్ దేవరకొండకు సరిపెట్టే ఆలోచనలలో ఉన్నట్లు సమాచారం. 
See the source image

మైత్రీ మూవీస్ బ్యానర్ లో సుకుమార్ మరో సినిమా చేయవలసి ఉన్న నేపధ్యంలో మహేష్ బాబుని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసిన కథ ఒకనాటి తెలంగాణ నిజాం పరిపాలన రజాకర్ల నేపధ్యంలో ఉంటుంది. అయితే అటువంటి కథకు తాను సరిపోను అని మహేష్ సుకుమార్ కు చెప్పడమే కాకుండా మరో కథను ఆలోచించమని కోరినట్లు వార్తలు వచ్చాయి.

దీనికితోడు మహేష్ లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ హడావిడి మార్చి వరకు ఉంటుంది. ఆతరువాత మహేష్ కనీసం ఒకటి రెండు నెలలు గ్యాప్ తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. దీనితో వచ్చే సంవత్సరం మే వరకు మహేష్ కథ గురించి ఆలోచిస్తూ సుకుమార్ ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. 

ఇలా ఇంత సమయం ఖాళీగా ఉండేదానికన్నా మహేష్ కోసం తయారు చేసిన తెలంగాణా రజాకర్ల కథను విజయ్ దేవరకొండకు సరిపోయే విధంగా మార్చి సినిమాగా తీస్తే బాగుంటుంది అన్న ఆలోచనలకు సుకుమార్ వచ్చినట్లు టాక్. ఇప్పటికే ఈవిషయమై సుకుమార్ విజయ్ దేవరకొండను కలవడం అతడి అంగీకారం తీసుకోవడం జరిగిపోయింది అంటున్నారు. దీనికితోడు విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు టాప్ దర్శకులతో నటించని నేపధ్యంలో సుకుమార్ ఇమేజ్ తనకు బాగా కలిసి వస్తుంది అన్న ఆలోచనలలో విజయ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: