రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవ ముహూర్తం ఫైనల్ కావడంతో ఈభారీ మల్టీ స్టారర్ ప్రారంభోత్సవానికి అతిధులుగా ఎవరు రాబోతున్నారు అన్న ఆసక్తికర చర్చలు అప్పుడే ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్ లో విపరీతంగా జరుగుతున్నాయి. నవంబర్ 11న జరగబోతున్న ఈ మల్టీ స్టారర్ ప్రారంభోత్సవానికి దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన ప్రభాస్ అతిధులుగా రాబోతున్నారని సమాచారం.

వీరితో పాటుగా రాజమౌళిని నేషనల్ సెలెబ్రెటీగా మార్చిన ‘బాహుబలి’ లో నటించిన ముఖ్య నటీనటులను కూడ రాజమౌళి ఈకార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు టాక్. ఈమూవీ ప్రారంభోత్సవం తరువాత రాజమౌళి ప్రత్యేకంగా మీడియా వర్గాలను కలిసి ఈమల్టీ స్టారర్ విశేషాలను తెలియ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. 

సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ప్రారంభోత్సవం జరిగిననాడే తన సినిమాకు సంబంధించిన కథను రేఖా మాత్రంగా వివరించడం రాజమౌళి అలవాటు. ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తూ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన కథ లైన్ ను అధికారికంగా చెపుతాడా లేదంటే ఈమూవీ విడుదల అయ్యేంత వరకు ఈ సస్పెన్స్ కొనసాగిస్తాడా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. 

ఇది ఇలా ఉండగా ఈమూవీ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు నేషనల్ మీడియాను కూడ రాజమౌళి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి భారీ మార్కెట్ ఏర్పడాలి అంటే ఆమూవీ ప్రారంభోత్సవం కూడ అత్యంత ఘనంగా జరగాలి అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి ఈభారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: