రామ్ చరణ్ భారీగా మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలకు సంబంధించి బిజినెస్ ఉమెన్ గా సామాజిక సేవకురాలిగా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది. ఇలాంటి పరిస్థుతులలో ఆమె లేటెస్ట్ గా ‘అంధ బాలికల’ వసతి విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ను రిక్వెస్ట్ చేసింది.
ఉపాసన రిక్వెస్ట్
అంధ బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గా పని చేస్తున్న శైలజా రాణి వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ సాంక్షన్ చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెపుతూ ఈ హాస్టల్ కోసం మంచి భవనం కూడ సాంక్షన్ చేస్తే మరింత సంతోషిస్తానని ఉపాసన తన ట్విటర్ ద్వారా కేటిఆర్ ను కోరింది. ఈవిషయమై ఉపాసన ట్విట్ ఇలా కొనసాగింది. 

‘ప్రియమైన తెలంగాణ ప్రభుత్వం. మీరు గొప్పగా పని చేస్తున్నారు. కానీ మీ నుంచి మరింత సహాయం అవసరం. ఈ బాలికల కోసం సహాయం చేయండి. నా వంతు సేవ నేను చేస్తున్నాను. దయచేసి వీరికి ఒక హాస్టల్ భవనం సాంక్షన్ చేయండి’ అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్న సింబల్‌ తో కేటీఆర్‌ కు ట్విట్ చేసింది ఉపాసన.
కేటీఆర్ ఏమన్నారంటే...
దీనికి కేటీఆర్ స్పందిస్తూ స్కూలు భవనం మంజూరైనందుకు సంతోషంగా ఉంది అని అంటూ  త్వరలోనే హాస్టల్ భవనం కూడా సాంక్షన్ చేస్తాం. అయితే డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలి అంటూ ఉపాసన ట్విట్ కు స్పందించారు కేటిఆర్. మరో రెండు రోజులలో రాబోతున్న దీపావళి సందర్భంగా ఉపాసన అంధ బాలికల కోసం కొత్త దుస్తువులను కానుకగా ఇచ్చి ఆవిషయాలను తన ట్విటర్ ద్వారా షేర్ చేసింది మెగా కోడలు..  



మరింత సమాచారం తెలుసుకోండి: