Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 1:41 am IST

Menu &Sections

Search

ఈ మూవీ చేయడానికి బయపడ్డాను:రిచా చద్దా

ఈ మూవీ చేయడానికి బయపడ్డాను:రిచా చద్దా
ఈ మూవీ చేయడానికి బయపడ్డాను:రిచా చద్దా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు మ‌ల‌యాళ సినీ ఇండస్ట్రీలో షకీలా అంటే ఎంత క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే.  షకిలా చిత్రం రిలీజ్ అవుతుంటే..స్టార్ హీరోల చిత్రాలు సైతం వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొనేదని టాక్.  ఆమెకు స్టార్ హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫోలోయింగ్ ఉండేది.  ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన షకీలా  అడ‌ల్ట్ స్టార్ పేరు తెచ్చుకుంది.  ఈ మద్య బయోపిక్ చిత్రాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీలా జీవిత కథ ఆధారంగా  ఇంద్ర‌జిత్ లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా ముఖ్యపాత్రలో ‘షకీలా’బయోపిక్ రాబోతుంది.   
shakeela-biopic-richa-met-shakeela-richa-chadha-ad
రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పేరిట టైటిల్‌ లోగోను విడుదల చేశారు. ఇందులో నేను పోర్న్ స్టార్ కాదు అని క్యాప్షన్ పెట్టారు.  తెలుగు‌తో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి  హీరోయిన్ రిచా చద్దా మాట్లాడుతూ..మొదట ఈ చిత్రంలో నటించడానికి చాలా బయపడ్డానని..అడల్ట్ స్టార్ పాత్రలో నటిస్తే విమర్శలు వస్తాయని కొంత మంది అన్నారు.  అయితే, షకీలాను కలిసి మాట్లాడిన తర్వాత ఈ చిత్రం చేయగలను అనిపించిందని తెలిపారు.
shakeela-biopic-richa-met-shakeela-richa-chadha-ad
షకీలా తనకు అన్యాయం చేసినవారిని సైతం క్షమించారని, ఆమె వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ఆమెకు నేను ఫ్యాన్ అయ్యానని తెలిపింది.  షకీలా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఆమెతో ఎంతో మంది లాభం పొందారని..కానీ ఆమె అత్యంత దీనమైన స్థితిలో ఉన్న సమయంలో ఎవరూ ఆదుకోలేక పోయారని వాపోయింది.  నిరుపేద నుంచి ధనికురాలై మళ్లీ పేదగా మారిన వ్యక్తి కథ ఈ ష‌కీలా. ఇది అంద‌రికి న‌చ్చుతుందని అంటుంది. మ్యాజిక్‌ సినిమా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ష‌కీలా కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 


shakeela-biopic-richa-met-shakeela-richa-chadha-ad
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.