ఊహించని రాజకీయ పరిణామాలతో తెలుగుదేశం కాంగ్రెస్ ల మధ్య చిగురించిన కొత్త స్నేహం ఎన్టీఆర్ బయోపిక్ కు సమస్యగా మారింది. దీనితో ఈ బయోపిక్ లో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నోటివెంట వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్స్ కు సంబంధించిన సన్నివేశాల పరిస్థితి ఏమిటి అని ఉత్పన్నమైన ప్రశ్నలకు దర్శకుడు క్రిష్ చాల తెలివిగా ఈ బయోపిక్ లో మార్పులు చేసి గండం గట్టేక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
The first look of the NTR biopic
తెలుస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన రెండవ పార్ట్ లో వచ్చే రాజకీయ సన్నివేశాలలో ఎన్టీఆర్ ఆనాటి పోరాటం ఇందిరా గాంధీ ఫ్యామిలీతో కాదు ఢిల్లీలోని కేంద్రప్రభుత్వం పెత్తనం పై పోరాటంగా మార్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమూవీలో వచ్చే డైలాగులలో ఎక్కడా కాంగ్రెస్ పై పోరు అని కాకుండా ఢిల్లీ పెత్తనం ఇంకానా ? ఇకపై చెల్లదు అనే డైలాగ్ ను పెట్టి చాల స్మార్ట్  గా ఛేంజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
Nandamuri Balakrishna and Rana Daggubati in a still from the NTR biopic
అంతేకాదు అప్పుడు ఎన్టీఆర్ చేసింది ఢిల్లీ పెత్తనం పై పోరు అయితే ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది ఢిల్లీ పెత్తనం పై పోరు మాత్రమే అని ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా ఈమూవీ డైలాగ్స్ లో చిన్నచిన్న మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ బాలయ్యా నిత్యామీనన్ లు ‘గుండమ్మ కథ’ లో సావిత్రి ఎన్టీఆర్ ల పాత్రలలో నటిస్తున్న ఫోటోను విడుదల చేసారు. 
S.-S.-Rajamouli-Formula-for-NTR-Biopic
ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల రీత్యా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ డైలాగ్స్ లో చాల తెలివిగా మార్పులు చేసినా ప్రేక్షకులు ఏమేరకు క్రిష్ చేసిన మార్పులను పూర్తిగా అంగీకరిస్తారు అన్న అనుమానాలు ఉన్నాయి. ఆరోజులలో ప్రజారధం పై కూర్చుని ఎన్టీఆర్ ఇందిరను కాంగ్రెస్ పార్టీని ఎన్నో తిట్లు తిట్టిన నేపధ్యంలో క్రిష్ తెలివిగా వాటిని తప్పించినా వాస్తవాలు ఏవీ చూపించకుండా తీయబడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రయోజనం ఏమిటి అన్న విషయం ఎవరికీ అర్ధంకాని విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: