తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.   వీరిద్దరి కాంబినేషన్ లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక నా పేరు సూర్య' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో బన్నీ ఆలోచనలో పడ్డాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు.  ఈ మద్య త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేష్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 
Image result for JULAYI
ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం ఎవరితో అన్నది త్రివిక్రమ్ క్లారిటీ ఇవ్వలేదు.  ‘నాపేరు సూర్య’ తర్వాత అల్లు అర్జున్ కి పలువురు దర్శకులు కథలు వినిపించిన నచ్చలేదని సమాచారం.  అయితే తాను మాత్రం త్రివిక్రమ్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ మద్య ఓ కార్యక్రమంలో తెలిపాడు. త్రివిక్రమ్ కోసమే తాను వెయిట్ చేస్తోన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాడు.
Image result for s/o satyamurthy
దాంతో 'అరవింద' పూర్తి కాగానే బన్నీ కోసం త్రివిక్రమ్ రంగంలోకి దిగిపోయాడు.  ఇదిలా ఉంటే రేపు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా త్రివిక్రమ్ - బన్నీ సినిమా గురించిన ప్రకటన రేపు అధికారికంగా రావచ్చుననే మాట బలంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందుతుందా? లేదంటే గీతా ఆర్ట్స్ పై నిర్మితమవుతుందా?  అనే విషయం రేపటితో తేలిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: