స్టార్ హీరో ఇళయదళపతి విజ‌య్‌, ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో ఇంతకుముందు వ‌చ్చిన తుపాకి, క‌త్తి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ‘సర్కార్’చిత్రం మొన్న మంగళవారం రిలీజ్ అయ్యింది.   రాజకీయ కోణంలో సాగిన ఈ చిత్రం పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.  తమిళ నాట అయితే కొంత మంది రాజకీయ పెద్దలను తప్పుగా చూపించారని..వారిని కించపరిచే విధంగా చిత్రం తీశారని వివాదాలు వినిపిస్తున్నాయి.   తెలుగులో  విడుదలైన ‘సర్కార్’చిత్రం వసూళ్లలో దుమ్మురేపుతోంది. అయితే, ఇప్పుడు చిత్రం చూసినవాళ్లంతా ‘సెక్షన్ 49పి’ గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. 
Image result for sarkar movie telugu
సన్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలైన ఈ చిత్రం కథాంశంలోకి వస్తే ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) ప్రపంచంలో నెంబర్ వన్ కార్పొరేట్ సంస్థకు సి.ఈ.ఓగా పని చేస్తుంటారు.  ఈ క్రమంలో ఆయన ఓటు ఎవరో దొంగ ఓటు వేస్తారు. దాంతో విజయ్ కి ఎక్కడో మండి..దీనిపై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దం అవుతాడు.  ఈ నేపథ్యంలో  ‘సెక్షన్ 49పి’ అంటూ ఒక చట్టాన్ని బయటపెడతారు. ఇప్పటి వరకు ఇలాంటి సెక్షన్ ఒకటుందని ఆ విషయం తమకు తెలియదని, సినిమా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసినందుకు సర్కార్ యూనిట్ కు, విజయ్ కు ధన్యవాదాలు చెబుతున్నారు.
Image result for sarkar movie telugu
పోలింగ్ సమయంలో తన ఓటును ఎవరైనా వేసినట్టు ఓటురు గుర్తిస్తే వెంటనే ఆ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఆ ఓటును వెనక్కి తీసేయమని అధికారులను కోరవచ్చు. సర్కారు చిత్రం విడుదలయ్యాక చాలామంది గూగుల్‌లో ‘సెక్షన్ 49పి’ గురించి వెతుకులాట ప్రారంభించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్సర్చ్ గూగుల్ ట్రెండ్స్ రిపోర్టును ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్  అయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: