Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:30 pm IST

Menu &Sections

Search

‘ఎన్‌జీకే’లో సూర్య లుక్ అదుర్స్!

‘ఎన్‌జీకే’లో సూర్య లుక్ అదుర్స్!
‘ఎన్‌జీకే’లో సూర్య లుక్ అదుర్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సూర్య అందరికీ సుపరిచితమే.  తమిళంలో ఏ చిత్రం వచ్చినా అది తెలుగులో డబ్ చేస్తుంటాడు సూర్య.  అంతే కాదు ఇక్కడ అభిమాన సంఘాలు కూడా బాగానే ఉన్నాయి..తమిళ నటుడు అయిన సూర్య తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తు ఏది వచ్చినా వెంటనే స్పందిస్తాడు. అందుకే తెలుగు ఇండస్ట్రీలో సూర్యకు విపరీతమైన క్రేజ్ ఉంది. న‌టుడిగా, నిర్మాత‌గా రాణిస్తూ ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో సూర్య‌. ప్ర‌స్తుతం త‌న 36వ చిత్రంగా సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఎన్‌జీకే’ అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ వారియర్ ఫిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
hero-suriya-selvaraghavan-rakul-preet-singh-saipal
ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. చెన్నైలో ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగును ప్లాన్ చేశారు. 15 రోజుల పాటలు జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగు పార్టు పూర్తికానుంది. ఈ చిత్రంపై అభిమానుల‌లో చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా సూర్య‌కి సంబంధించి స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో సూర్య లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ప్రస్తుతం ముఖ్య పాత్రలకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

hero-suriya-selvaraghavan-rakul-preet-singh-saipal
వాస్తవానికి ఈ చిత్రం దీపావళికి విడుదలయ్యేలా చూడాలని సూర్య భావించాడు. కానీ 'సర్కార్' రంగంలోకి దిగడం వలన .. అది కూడా పొలిటికల్ డ్రామా నేపథ్యంతో కూడిన కథ కావడం వలన వెనక్కి తగ్గారట. ఇదిలా ఉంటే సూర్య త‌న 37వ చిత్రంగా కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. 38వ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని తెలుస్తోంది. తమిళంలో 'ఇరుదు సుట్రు'తో హిట్ కొట్టి .. 'గురు' పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సుధా కొంగర, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు సూర్య 39వ చిత్రం ‘మనం’ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉండబోతున్నట్లు సమాచారం. 


hero-suriya-selvaraghavan-rakul-preet-singh-saipal
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
మరోసారి మంటకలిసిన మానవత్వం!
నాన్నగారి ఆరోగ్యం బాగుంది : గౌతమ్
ప్రపంచ కప్ లో కి పంత్ తీసుకోవడం సరికాదు! : సచిన్
నేటి నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఆ పుకార్లను నమ్మోద్దు : మురుగదాస్
నాగసాదువులు-నానో టెక్నాలజీ
అనూహ్య విజయం...చరిత్రను తిరగరాసిన థెరీసా మే
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు స్వైన్‌ ఫ్లూ..ఆస్పత్రిలో చేరిక!
దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఎన్టీఆర్, రాంచరణ్ లకు జక్కన్న షాక్!
హాస్యనటుడు బ్రహ్మానందం కు బైపాస్‌ సర్జరీ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.