తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ విజయ్ నటించిన చిత్రాలకు ఈ మద్య వరుసగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.  తాజాగా విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'.  ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది...మొదటి నుంచి ఈ చిత్రంపై రక రకాలు విమర్శలు వస్తున్నాయి.  కాగా, థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఈ వివాదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ చిత్రంలో కొన్ని రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ తమిళ నాడు ప్రభుత్వం, ఇతర పార్టీలు భగ్గుమంటున్నాయి. 
Image result for movie theaters close sarkar
అంతేకాదు ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని అన్నాడీఎంకె పార్టీ నేతలు కోరారు. కానీ అలాంటి సన్నివేశాలు తొలగించకుండా చిత్రాన్ని కొన్ని థియేటర్లలో ఆడిస్తున్నారు.  దాంతో నిరసనకారులు  థియేటర్లకు చేరుకొని విధ్వంసాలను సృష్టిస్తున్నారు. దీంతో తమిళనాడులో చాలా థియేటర్లలో చిత్రాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ‘సర్కార్’చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని థియేటర్స్ అసోసియేషన్ చిత్రనిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సన్నివేశాలను తొలగించలేకపోతే చిత్రాన్ని ప్రదర్శించలేమని అంటున్నాయి థియేటర్ యాజమాన్యాలు.
Image result for movie theaters close sarkar
ఇక తమిళనాట దర్శకుడు మురుగదాస్ ని అరెస్ట్ చేశారనే వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.  అయితే ‘సర్కార్’ చిత్రంలో ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని కమీషనర్ కి అన్నాడీఎంకె మద్దతుదారుడు దేవరాజన్ ఫిర్యాదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: