తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే నేచురల్ స్టార్ నాని, శర్వానంత్, అఖిల్ లాంటి హీరోలు వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.  ఇక పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.  ఈ మద్య విజయ్ భూపతి దర్శకత్వంలో ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో మంచి విజయం అందుకున్న యువ హీరో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో ఈ హీరోతో చిత్రాలు  చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. 
Image result for r x 100 movie kartikeya
మొదటి సినిమాతో ‘ఆర్ఎక్స్ 100’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించి మంచి గుర్తింపును పొందిన యువ హీరో కార్తికేయ తన రెండో చిత్రం ‘హిప్పీ’ లో నటించనున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా  ఈ చిత్రం షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. 
Related image
కోలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈచిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. మొత్తానికి చాలా తక్కువ సమయంలోనే కార్తికేయ తమిళ ప్రేక్షకులకి కూడా పరిచయం కానున్నాడన్న మాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: