తెలుగు ఇండస్ట్రీలో ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు.  తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో నటిస్తున్న తమన్నాకు తెలుగు లో అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు.  ఆ మద్య రాజమౌళి తెరకెక్కించిన బాహబలి పార్ట్ 1 లో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించినా..బాహుబలి 2 లో మాత్రం పెద్దగా కనిపించలేదు. బాలీవుడ్ లో  ‘హమ్ తుమ్'.. 'ఫనా' లాంటి చిత్రాలను తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి తెలుగులో ఒక సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. 


తమన్నా, సందీప్ కిషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలైనా మీడియాలో మాత్రం పెద్దగా అప్ డేట్స్ రాలేదు.  ఇదిలా ఉంటే..టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం మొదటి సారి.  నవదీప్, పూనమ్ కౌర్‌, శరత్ బాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి 'నెక్స్ట్ ఏంటి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా మేకర్స్ వెల్లడించారు.  


తాజాగా టైటిల్  లోగోతో కూడిన ఫస్టులుక్ ను రానా చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఒక స్టిల్ లో తమన్నా- సందీప్ లో ఉత్సాహంగా లండన్ వీధుల్లో స్టెప్స్ వేస్తుండగా మరో స్టిల్ లో సందీప్ - నవదీప్ కలిసి ఉన్నారు. లండన్, హైదరాబాద్ లోని పలు అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్‌ని అతి త్వరలో ప్రకటించనున్నామని చిత్ర నిర్మాతలు రైనా జోషి, అక్షయ్ పూరి తెలిపారు. చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తుండగా, మనీష్ చంద్ర భట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: