చిరంజీవి పవన్ కళ్యాణ్ ల దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్న విషయాన్ని అనేకసార్లు వీరిద్దరూ పరోక్షంగా నిజం చేస్తూ ఈ అన్నదమ్ముల సాన్నిహిత్యం గురించి వస్తున్న అనుమానాలకు సమాధానం ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో నిన్న పవన్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కట్టుకున్న ఒక విలాసవంతమైన భవనం గృహప్రవేశానికి చిరంజీవి తన భార్యతో సహా వచ్చి పవన్ ను ఆశీర్వదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 
 పంచెకట్టుతో మెగా బ్రదర్స్
గృహప్రవేశం సందర్భంగా చిరంజీవి పవన్ లు సాంప్రదాయకంగా పంచె కట్టుతో కనిపిస్తున్న ఫోటోలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. ఈ గృహప్రవేశం హడావిడి తరువాత చిరంజీవి చాలాసేపు పవన్ కొత్త ఇంటిలో ఉండటమే కాకుండా ‘జనసేన’ కు సంబంధించిన అనేక విషయాల పై చిరంజీవి తన సలహాలను పవన్ కు ఇచ్చినట్లు సమాచారం.
పవన్ మిస్సయ్యాడు అంటూ
వాస్తవానికి పవన్ ‘జనసేన’ వెనుక మెగా కుటుంబం అంతా ఉన్నప్పటికీ ఆవిషయాన్ని బహిరంగంగా కాకుండా తెరవెనుక మాత్రమే ఉంచాలని అన్న ఉద్దేశ్యంతో ‘జనసేన’ విషయాలకు అదేవిధంగా రాబోతున్న ఎన్నికల ప్రచారానికి మెగా కుటుంబాన్ని దూరంగా ఉంచాలి అన్న వ్యూహం చిరంజీవిది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే మొన్న జరిగిన దీపావళి పండుగ రోజున చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాలకు మెగా కుటుంబ సభ్యులు అంతా వచ్చి పండుగ చేసుకున్నా పవన్ మాత్రం ఆ దీపావళి సంబరాలకు రాకపోవడంతో మెగా అభిమానులు నిరాశ చెందారు.
దీపావళి సెలెబ్రేషన్స్
అయితే ఈ సంఘటన జరిగి రెండు రోజులు కాకుండానే చిరంజీవి పవన్ ఇంటికి వెళ్ళడం వాళ్ళిద్దరూ సాంప్రదాయంగా పంచె కట్టుతో కనిపిస్తూ చేసిన హడావిడికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి ప్రేమానురాగాలు మరొకసారి బయటపడ్డాయి. వాస్తవానికి ప్రస్తుతం పవన్ నిర్వహిస్తున్న ‘ప్రజా పోరాటయాత్ర’ కు ఉభయ గోదావరి జిల్లాలలో అంచనాలకు మించి జనం వచ్చినా ఈ వచ్చిన జనం అభిమానాన్ని ఓట్లగా మార్చుకుని రాబోతున్న ఎన్నికలలో తన సత్తా చాటుకోవడానికి ఇప్పటికీ ‘జనసేన’ కు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కమిటీలు లేకపోవడంతో పవన్ ‘జనసేన’ కు ఎంతవరకు ఓట్లు పడతాయి అన్న విషయం రాజకీయ విశ్లేషకులకు కూడ అర్థంకాని ప్రశ్నగానే కొనసాగుతూనే ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: