‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరువాత క్రిష్ బాలయ్యల సాన్నిహిత్యం బాగా పెరిగింది. నందమూరి అభిమానులు బాలకృష్ణను ఎలాంటి పాత్రలో చూడాలి అని అనుకుంటారో ఆవిషయాలు బాగా పసికట్టిన క్రిష్ సామర్ధ్యం పై బాలయ్యకు ఎంతో నమ్మకం. ఈనమ్మకమే తిరిగి బాలయ్య క్రిష్ లను ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కలిపింది.

రేపు క్రిష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ సమయంలో ఎంతో శ్రద్ధగా క్రిష్ ఇస్తున్న సూచనలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసి క్రిష్ కు ఊహించని సర్ప్రైజ్ లు ఇచ్చాడు బాలయ్య. క్రియేటివ్ దర్శకుడుగా క్రిష్ తీసిన సినిమాల సంఖ్య చాల తక్కువే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని సృష్టించుకున్న ఘనత క్రిష్ సొంతం.

సంక్రాంతికి రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో వివాదాలకు దూరంగా ఎన్టీఆర్ జీవితాన్ని ఈనాటితరం ప్రేక్షకులకు చూపించడానికి క్రిష్ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా అక్కినేని ఎన్టీఆర్ ల లుక్ విషయంలో అదేవిధంగా వారి బాడీ లాంగ్వేజ్ విషయంలో క్రిష్ చూపిస్తున్న శ్రద్ద అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

వచ్చే ఏడాది జనవరిలో క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన రెండు పార్ట్ లతో పాటు బాలీవుడ్ మూవీ మణికర్ణిక మూవీ కూడ ఒకే నెలలో విడుదల అవుతున్న నేపధ్యంలో ఒకే నెలలో మూడు సినిమాలను దర్శకత్వం వహించి విడుదల చేసే అరుదైన రికార్డ్ క్రిష్ సొంతం కాబోతోంది. బాలయ్య క్రిష్ ల కలయికతో రూపొందింపబడ్డ ఎన్టీఆర్ బయోపిక్ తెలుగుదేశం పార్టీ వర్గాలకు అత్యంత కీలకంగా మారిన నేపధ్యంలో క్రిష్ చేయబోయే మ్యాజిక్ కోసం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అత్యంత ఆశగా ఎదురుచూస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: