‘బిగ్‌బాస్‌ 2’ ప్రోగ్రామ్‌ జరుగుతున్నంత సేపు ఎక్కడ చూసినా కౌశల్ నామస్మరణ కనిపించడంతో ఆ షో ముగిసిన తరువాత కౌశల్ తనకు ఏర్పడిన స్టార్ ఇమేజ్ తో సంచలనాలు చేస్తాడు అని చాలామంది భావించారు. దీనికితోడు కౌశల్ ఆర్మీ పేరిట ఒక సైన్యం ఏర్పడటంతో కౌశల్ ఇమేజ్ ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో రాజకీయ పార్టీలు ఉపయోగించుకోబోతున్నాయి అంటూ ఊహాగానాలు కూడ వచ్చాయి. 
geetha madhuri targets kaushal, who is bigg boss title winner
అయితే జరుగుతున్న వాస్తవాలు వేరు. ‘బిగ్ బాస్ 2’ షో నుంచి బయటకు వచ్చిన తరువాత కౌశల్ కు సన్మానాలు సత్కారాలు జరుగుతున్నాయి కానీ కౌశల్ ఊహించుకున్న రేంజ్ లో అవకాశాలు రావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు కౌశల్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని చిన్నచిన్న వ్యాపార సంస్థలు కూడ తమ ప్రకటనలకు కౌశల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 
Bigg Boss Telugu 2 Winner Kaushal manda
అదేవిధంగా కౌశల్ పై ప్రశంసలు కురిపించిన చాలామంది దర్శకులు కౌశల్ కు తాము తీయబోయే సినిమాలలో అవకాశాలు ఇస్తాము అంటూ ఇప్పటికీ ప్రకటించని నేపధ్యంలో బుల్లితెర స్టార్ కౌశల్ హవా తగ్గిపోయిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలను పరిశీలిస్తున్న విశ్లేషకుల అభిప్రాయం వేరే విధంగా ఉంది. 
Bigg Boss 2 Telugu: Kaushal Dog Comment creates sensation
‘బిగ్‌ బాస్‌’ కంటెస్టెంట్‌ లు ఎవరూ ఆషో ముగిసిన తరువాత అంతగా న్యూస్‌ లో ఉండరు అన్న విషయం కౌశల్ విషయంలో కూడ నిజమైంది అనీ గత షోల లోని పార్టిసిపెంట్స్ కంటే కౌశల్ ఎక్కడ కనిపించినా కనిపిస్తే ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు తీసుకునే వారు ఎక్కువ ఉండడం మినహాయిస్తే కొత్తగా కౌశల్ కు కలిసివచ్చింది ఏమీలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఒక సముద్ర కెరటంలా ఉవ్వెత్తున లేచిన కౌశల్ ఇమేజ్ ప్రస్తుతం చల్లరిపోవడం చాలామందికి ఆశ్చర్యకరంగా మారింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: