ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్న రాజమౌళి మల్టీ స్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభానికి రాజమౌళి మీడియా వర్గాలను దూరం పెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సామాన్యంగా రాజమౌళి మీడియా వర్గాలతో చాల సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. దీనితో ‘బాహుబలి’ సక్సస్ కు మీడియా తన వంతు సహకారం అందిస్తూ ఆసినిమా తమ సొంత సినిమా అన్న స్థాయిలో రాజమౌళికి అప్పట్లో మీడియా వర్గాలు సహకరించాయి. 

అయితే ఆ విషయాలు అన్నీ మరిచిపోయి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ లాంచ్ ని కేవలం తమ యూనిట్ కు సంబంధించిన ఫంక్షన్ గా మార్చి మీడియా వర్గాలను దూరం పెట్టి ప్రవేట్ ఫంక్షన్ గా నిర్వహించడం మీడియా వర్గాలకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. దీనితో రాజమౌళికి మీడియా అవసరాలు తీరిపోయాయా అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఈరోజు జరుగుతున్న ఈమూవీ లాంచ్ ఫంక్షన్ కు మీడియాను దూరం పెట్టడంతో రాజమౌళి ఈ ఫంక్షన్ జరిగిన తరువాత ఈ మూవీ లాంచ్ కి సంబంధించిన ఫోటోలను మీడియాకు విడుదల చేస్తాడని టాక్. మీడియాను రాజమౌళి దూరం పెట్టినా ఆ ఫంక్షన్ ఫోటోలు జనం మధ్యకు తీసుకువెళ్ళే విషయంలో తిరిగి రాజమౌళి మీడియా సహకారం కోరుకుంటాడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. 

సాధారణంగా రాజమౌళి తన సినిమా ప్రారంభం రోజునే ఆమూవీకి సంబంధించిన స్టోరీ లైన్ చెప్పడం అతడికి అలవాటు. అయితే ఈసారి ఈఅలవాటును తప్పించి ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో మరి కొంత కాలం సస్పెన్స్ కొనసాగించాలి అన్న ఉద్దేశ్యంతో రాజమౌళి ఇలా వ్యూహాత్మకంగా మీడియాను ఈరోజు ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవ ఫంక్షన్ కు దూరంగా ఉంచాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: