రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఈరోజు ఉదయం 11 గంటల 11 నిముషాలకు లాంచనంగా ప్రారంభం కావడం వెనుక చవితి సెంటిమెంట్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ చరణ్ రాజమౌళిల జాతక రీత్యా ఈ చవితి జ్యోతిష్య శాస్త్ర రీత్యా బాగా కలిసి వస్తుందని కొందరు జ్యోతిష్యులు సూచించడంతో చవితి నెగిటివ్ సెంటిమెంట్ ను పక్కకు పెట్టి ఈమూవీ ప్రారంభోత్సవాన్ని ఎటువంటి హడావిడి లేకుండా రాజమౌళి నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి.
రూ. 300 కోట్ల బడ్జెట్
రాజమౌళికి ఫిలిం ఇండస్ట్రీలో గురువుగా మరియు శ్రేయోభిలాషిగా పేరు గాంచిన రాఘవేంద్రావు చేతుల మీదుగా ఈ ఫిలిం స్క్రిప్ట్ బౌండ్ కు పూజలు చేసి ఆ స్క్రిప్ట్ ను రాజమౌళి చరణ్ జూనియర్ లకు కలిసి అందించడంలో కూడ రాజమౌళి ఈ సెంటిమెంట్ ను ఫాలో అయినట్లు టాక్. అయితే మీడియా వర్గాలకు దూరంగా ఈమూవీ ప్రారంభం జరగడంతో మీడియాలోని కొన్ని వర్గాలు ఈమూవీ ప్రారంభం పై ఇప్పటికే అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. 
విజేంద్ర ప్రసాద్ కథ
 1920 నాటి కథాంశంతో ఈమూవీ సాగుతుంది అన్న ప్రచారం జరుగుతున్నా కేవలం ఈమూవీలో కొద్ది సేపు మాత్రమే 1920 నాటి కాలం కనపడుతుందని మిగతాది అంత ప్రస్తుత వాతావరణంలోనే మూవీ కథ నడుస్తుందని సమాచారం. మెగా స్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్ ఈ ప్రారంభోత్సవ వేడుకలకు హాజరు అయినా ‘బాహుబలి’ ని బాలీవుడ్ లో ప్రమోట్ చేసి రాజమౌళికి ఎంతో సన్నిహితుడైన కరణ్ జోహర్ ఈనాటి కార్యక్రమానికి దూరంగా ఉండటం అనేక సందేహాలకు తావు ఇస్తోంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ఈసారి తన సొంత ఇమేజ్ తోనే ‘ఆర్ ఆర్ ఆర్’ ను జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఏది ఏమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రను మరొకసారి తిరగ రాయాలని రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలకు ఈ చవితి సెంటిమెంట్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి..    



మరింత సమాచారం తెలుసుకోండి: