తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ కమెడియన్లలో ఒకరుగా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు వెన్నెల కిషోర్.  ‘వెన్నెల’ చిత్రంతో కమెడియన్ గా పరిచయం అయిన వెన్నెల కిషోర్ తనదైన మానరీజంతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఒకదశలో బ్రహ్మానందానికి ధీటుగా తన వెరైటీ కనుసైగలతో కామెడీ పండిస్తున్నాడు. ఇక వెన్నెల కిషోర్ ట్విట్స్ అన్ని సరదాగా....వెరైటీగా....చదవాలని అనిపించేలా ఉంటాయి. ప్ర‌స్తుతం ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` సినిమాలో నటించాడు. 
Image result for vennela kishore twitter
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ పాత్ర ఆద్యంతం ఆసక్తి కరంగా ఉండబోతుందట.  ఇక సోషల్ మీడియాలో వెన్నెల కిషోర్ చేేసే ట్విట్లు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగాత మొన్న దాదాపు 10 రకాల స్వీట్స్ పెట్టి రాత్రి 8 గంటల తర్వాత ఈ కొంచెం తింటే చాలు అని ట్వీటి నెట్టింట్లో సందడి చేశాడు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా మరొకటి ట్వీట్ పెట్ట మరోసారి నవ్విస్తున్నాడు. ‘ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ‘మీ ఫుడ్‌ని తూకం వేయండి’ డైట్ ప్లాన్స్, 100 గ్రాముల కార్బ్ డైట్ ప్లాన్స్, నిజానికి 100 గ్రాముల్లో ఏమి దొరుకుతుందో చెక్ చేయాలని ఉంది.
Image result for vennela kishore twitter
ఈ డైట్‌లకు మంట పెట్టా’ అని ట్వీట్ చేశాడు.  అయితే తాను పంపిన ట్విట్ పై నెటిజన్లు కూడా రక రకాలుగా స్పందిస్తున్నారు.  ఈ ట్వీట్‌ని చూసిన నెటిజన్లు ‘ఆ కమలాలో తొక్కే 30 గ్రాములు పోతుందిగా డార్లింగ్’ అని ఒకరు... ‘మనకెందుకు కాకా ఈ డైటింగ్‌లు’ అని మరికొందరు సరదా సరదాగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: