తెలుగు ఇండస్ట్రీలో టాప్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్స్ బాట పడ్డాడు.  దాంతో శ్రీను వైట్ల కెరీర్ ఎండ్ అయ్యిందని బావిస్తున్న సమయంలో మాస్ మహరాజ రవితేజ హీరోగా  ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇలియానా నటించారు. శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో నీ కోసం,వెంకి, దుబాయ్ శీను సూపర్ హిట్ అయ్యాయి.  ఇక రవితేజ సరసన ఇలియానా రెండు చిత్రాల్లో నటించింది.  ఇక తెలుగు లో మంచి ఫామ్ లో కొనసాగుతున్న ఇలియానా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగు లో నటించలేదు.  అంతే కాదు ఈ చిత్రంలో ఇలియానా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. 

Image result for అమర్ అక్బర్ ఆంటోని సెన్సార్

తాజాగా  ‘అమర్ అక్బర్ ఆంటోని’  ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇస్తుంది.  అప్పట్లో ఇలియానా నాజూగ్గా నడుం వంపులతో కనిపించేది..తాజాగా అమర్ అక్బర్ ఆంటోని లో కాస్త బొద్దుగా కనిపిస్తుంది.   తాజాగా ఈ చిత్రం  సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారని ఈ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా, ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. 

Image result for అమర్ అక్బర్ ఆంటోని సెన్సార్

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఇలియానా,రవితేజ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం విజయం రవితేజకి,ఇలియానాకి,శ్రీను వైట్లకి చాలా అవసరం. ఈ చిత్రం కనుక విజయం అందిస్తే వీళ్ళకి మళ్ళీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.  థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: