నాడు బహుముఖ ప్రఙ్జావంతురాలు భానుమతితో మాట్లాడాలంటే మహానటులు దిగ్దర్శకులు సైతం కొంత సంయమనం పాటించేవారట. కారణం ఆమె వ్యక్తిగత ప్రవర్తన. అందుకే ఆమెకు Me...Too.. అనుభవం ఉండి ఉండకపోవచ్చు.


చక్కని అభినయంతో తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందిన నటి నిత్యా మీనన్. ‘మిషన్ మంగల్’ సినిమాతో ఆమె త్వరలో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న Me...Too ఉద్యమం, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు గురించి నిత్య తనదైన శైలిలో స్పందించారు. 
nitya menon Me Too కోసం చిత్ర ఫలితం
ఇటీవల కేరళాలో ఒక ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక హీరో దిలీప్ ఉన్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సందర్భంగా నటీమణులంతా "ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్" గా ఏర్పడి ఉద్యమించారు. అయితే, అదే పరిశ్రమకు చెందిన నిత్యా మీనన్ మాత్రం అందులో చేరలేదు.


దీనిపై ఆమె స్పందిస్తూ, "లైంగిక వేధింపులపై నేను పోరాడే విధానం వేరు. మద్దతు తెలపలేదని నేను వారి ఉద్యమానికి వ్యతి రేకమని భావించవద్దు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి నాకు తెలుసు. అలాంటి సమస్య నాకు ఎదురైతే, ఏం చేయాలో? నాకు తెలుసు. నేను ఏ పని చేసినా చాలా సైలెంట్‌గా చేసుకుపోతా! లైంగిక వేధింపుల విషయంలో కూడా అంతే. నా విధానమే వేరు!" అని తెలిపారు. 
nitya menon Me Too కోసం చిత్ర ఫలితం
"ఔను, ఆ సినిమా వదిలేశా!"  లైంగిక వేధింపుల నేపథ్యంలో మీరు ఒక చిత్రాన్ని వదులుకున్నారని తెలిసింది. నిజమేనా? అని అడిగిన ప్రశ్నకు నిత్యా  సమాధానం  ఇస్తూ.. "ఔను, నిజమే" అని సమాధానం ఇచ్చారు. అయితే, ఆ సినిమా పేరును మాత్రం ఆమె వెల్లడించ లేదు. అయితే, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తాను సినిమాలు వదలుకోడానికి సంకోచించనని నిత్యా తెలిపారు. 


సినిమా అంగీకరించడానికి ముందుగానే అలాంటి విషయాల్లో జాగ్రత్త పడతానని పేర్కొన్నారు. "ఇందుకు నేను కొన్ని పద్ధతులను పాటిస్తాను. లైంగిక వేధింపులు వంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మన వర్కింగ్ స్టైల్‌ తోనే బలమైన మెసేజ్ ఇవ్వాలి. దీనివల్ల మనతో తప్పుగా ప్రవర్తించడం, లేదా తప్పుడు ఉద్దేశంతో అవకాశాలు ఇస్తామనడం వంటివి ఉండవు" అని నిత్యా మీనన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ నటిస్తున్న "యన్.టి.ఆర్ - కథానాయకుడు" సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. 

NTR kathanayakuDu - Nitya కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: