పవర్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ ను ఎవరైనా హంతకుడు అని భావించారు అంటే ఎవరూ నమ్మలేని విషయం. అయితే గతంలో పవన్ ను హంతకుడుగా అమెరికన్స్ భావించిన యదార్ధ విషయాన్ని పవన్ స్వయంగా బయటపెట్టడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
కేవలం ఓటు బ్యాకుంగానే
పవన్ ఈ ఆసక్తికర విషయాన్ని కాకినాడలో ముస్లిం కమ్యూనిటీతో సమావేశం అయినప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టాడు. అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ సంఘటన సమయంలో కొందరు తనను చూసి ముస్లిం అని పొరబడ్డారని తాను అక్కడి అమెరికన్స్ ను  చంపేస్తానేమో అని భయపడ్డారని అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు పవన్ కల్యాణ్. 
ప్రతి మతంలో అలాంటి వారు ఉంటారు
అమెరికాలో సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్ బ్లాస్ట్ జరిగినపుడు తాను అమెరికాలోనే ఉన్న విషయాన్ని వివరిస్తూ అప్పుడు తనకు బాగా గడ్డం ఉండటంతో తన   అవతారం చూసి ఓ అమెరికన్ తనను ముస్లిం అని భావించి భయపడ్డ విషయాన్ని వివరించాడు. ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ చెడ్డ వ్యక్తులు ప్రతి మతంలోనూ ఉంటారని అయితే కొన్ని సంఘటనల ఆధారంగా ఒక మతానికి చెందిన అందరినీ టెర్రరిస్టులుగా భావించడం సరికాదు అంటూ పవన్ కామెంట్స్ చేసాడు. 
ముస్లిం ఎదుర్కొంటున్న సమస్య అర్థమైంది
ప్రస్థుత ప్రభుత్వాలు ముస్లింల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని, మైనారిటీల పేరుతో వారిని కేవలం ఓటు బ్యాంకుగానే మార్చుకుంటున్నారని షాకింగ్ కామెంట్స్ చేస్తూ పవన్ ముస్లిం ఓటు బ్యాంక్ పై దృష్టి పెట్టాడు. ఈ సమావేశంలో పాల్గొన్న కొందరు ముస్లిం యువకులు కొందరు పవన్ ను మళ్ళీ ఎన్నికల తరువాత సినిమాలలో నటిస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తరువాత అప్పటి పరిస్తుతులను బట్టి తన నిర్ణయం ఉంటుంది అంటూ తాను శాస్వితంగా సినిమాలకు దూరం కాలేదు అన్న సంకేతాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్..



మరింత సమాచారం తెలుసుకోండి: