రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభమై 5 రోజులు అవుతున్నా ఇంకా ఆవార్తలు హడావిడి ఇండస్ట్రీ వర్గాలలో మీడియాలో కనిపిస్తూనే ఉంది. ఇక లేటెస్ట్ గా ఈమూవీ ప్రారంభోత్సవ పూజ జరుగుతున్నప్పుడు అందరూ పూజ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరగా వెళితే జూనియర్ ఆపూజ ప్రదేశానికి దగ్గరగా వెళ్ళకుండా దూరంగా నుంచుని ఉన్న విషయానికి సంబంధించిన ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
హీరోయిన్లు ఇంకా
సర్వ సాధారణంగా ఒక మూవీ లేదా ఒక వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిధులు చేత కొబ్బరికాయలు కొట్టించడం సాంప్రదాయం. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవ సమయంలో జూనియర్ దేవుడు పటాల ఎదుట కొబ్బరికాయ కొట్టడానికి అంగీకరించలేదు అని తెలిసింది. 
Rajamouli's RRR Movie Launch Photos
దీనికి కారణం ఈమధ్యనే జూనియర్ తండ్రి హరికృష్ణ చనిపోవడంతో తారక్ తాను ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభోత్సవ సమయంలో తన చేతులతో కొబ్బరికాయ కొట్టడం మంచిది కాదు అని భావించాడట. దీనితో ఈవిషయాలు తెలుసుకున్న చరణ్ జూనియర్ దగ్గరకు వెళ్ళి పూజ దగ్గరకు రమ్మని కోరినా జూనియర్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 
Rajamouli's RRR Movie Launch Photos
ఈ సున్నిత సమస్యను గమనించిన చిరంజీవి ఆపూజ చేస్తున్న బ్రాహ్మణుడుతో మాట్లాడటం అతడి సలహామేరకు చరణ్ ఒక కొబ్బరికాయను తీసుకుని కొద్దిగా దూరంగా ఉన్న జూనియర్ దగ్గరకు తీసుకువెళ్ళి అతడి చేతిని కొబ్బరికాయ పై పెట్టించి చరణ్ జూనియర్ తరుఫున కొబ్బరికాయ కొట్టడంతో ఈ సున్నిత సమస్య పరిష్కారం అయింది అని తెలుస్తోంది. అంత హడావిడిలో ఒక చిన్న విషయాన్ని కూడ పరిశీలిస్తూ చరణ్ చేసిన మంత్రాంగం చరణ్ జూనియర్ ల మధ్య సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది అంటూ ఆకార్యక్రమానికి వచ్చిన చాలామంది ప్రముఖులు చర్చించుకున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: