బాలీవుడ్ లో గత కొంతకాలంగా స్టార్ హీరో, హీరోయిన్ల వివాహాలతో సందడి వాతావరణం నెలకొంది.  ఆ మద్య అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ కూతురు వివాహం జరిగింది.  ఆ తర్వాత ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఆ తర్వాత స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇటలీలోని లేక్ కోమోలో కొంకణి సంప్రదాయంలో నేడు అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు రణ్వీర్ సీప్లేన్ లో మండపానికి వచ్చాడు.

బెంగళూరు, ముంబైలో విందు ఏర్పాట్లు

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి డిజైన్ చేసిన చీరను దీపిక ధరించిందట. మొదట నిశ్చితార్థ వేడుక అనంతరం వివాహం జరిగింది.   నిశ్చితార్థ వేడుకలో భాగంగా రణ్‌వీర్.. దీపిక వేలికి ఉంగరం తొడుగుతుండగా.. దీపిక భావోద్వేగానికి లోనైందని సమాచారం.దీపిక, రణ్‌వీర్ వివాహాన్ని సంప్రదాయ చిత్రపుర్ సరస్వత్ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. దీపికా పదుకొన్ కర్ణాటకలోని సరస్వత్ బ్రాహ్మణ కమ్యూనిటికి చెందిన వారని తెలిసిందే. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. 

ఘనంగా సంగీత్ కార్యక్రమం

పెళ్లి పీటల మీదకు వచ్చే సమయంలో దీపికా పదుకొన్ బంగారం రంగులో ఉండే సవ్యసాచి చీరను కట్టుకొన్నారు. రణ్‌వీర్ కంజీవరం షేర్వానీ ధరించారు. వీరి పెళ్లి తంతు చాలా ఉత్సాహంగా జరిగినట్టు తెలిసింది.  ఈ వేడుక కోసం ఇప్పటికే బాలీవుడ్ సింగర్ హర్షదీప్ కౌర్, సంజయ్ దాస్, బాబీ పాథక్, ఫిరోజ్ ఖాన్ బృందం సంగీత్‌లో తమ ప్రదర్శన ఇచ్చారు.

నవంబర్ 15న మరోసారి పెళ్లి

రణ్ వీర్ కుటుంబ సంప్రదాయం ఆనంద్ కరాజ్ పద్ధతిలో ఈ పెళ్లిని నిర్వహిస్తారు. ఈ పెళ్లి తంతుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం నవంబర్ 16న స్వదేశానికి బయలుదేరుతారు. వివాహానికి వచ్చే అతిథులు రిస్ట్ బ్యాండ్స్, శుభలేఖతో రావాలని ఎలాంటి బహుమతులు తీసుకు రావొద్దని  నిబంధనలు విధించారు.  ఇక దీపికా, రణ్‌వీర్ పెళ్లి వేడుకకు సంబంధించి విందుకు బెంగళూరు లీలా ప్యాలెస్ హోటల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విందు నవంబర్ 21న జరుగుతుంది. అనంతరం నవంబర్ 28న ముంబైలో సినీ, వ్యాపార వర్గాల కోసం విందును ఏర్పాటు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: