రేపు విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ ఫలితం బట్టీ విజయ్ దేవరకొండ భవిష్యత్ సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో రేపు విడుదల కాబోతున్న ‘టాక్సీవాలా’ మూవీ ఫలితం గురించి అతడి అభిమానులతోపాటు  ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తోంది అన్న విషయానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. 
ఒక్క రోజులో స్టార్‌ని కాలేదు
ప్రస్తుతం ‘టాక్సీవాలా’ టిక్కెట్లకు ఆన్ లైన్ బుకింగ్ లో స్పీడ్ కనిపిస్తున్నా ఈవిషయానికి మించి ‘టాక్సీవాలా’ హోమ్ ధియేటర్ షోలకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు తమ హోమ్ ధియేటర్స్ లో ఈమూవీని రేపు చూడటానికి ‘క్యూబ్ ప్రింట్స్’ కు సంబంధించిన సౌకర్యాన్ని కలిగించ వలసిందిగా ఈ మూవీ బయ్యర్లను అడుగుతున్నట్లు సమాచారం. 
నోర్లు మూయిస్తా
గతంలో ‘బాహుబలి’ విడుదల సమయంలో ఇలా హోమ్ ధియేటర్ షోలకు ఈమూవీ బయ్యర్ల పైనా అదేవిధంగా రాజమౌళి పైనా విపరీతంగా ఒత్తిడి వచ్చిన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆతరువాత ఇండస్ట్రీలో ఎన్నో భారీ సినిమాలు విడుదలైనా ఇలా మొదటిరోజు మొదటి షో తమ హోమ్ ధియేటర్స్ లో చూడాలని ఉంది అంటూ ఇలా ఇండస్ట్రీ ప్రముఖులు అడిగిన సందర్భాలు లేవు అని అంటున్నారు.
ఎక్కువగా ఎవర్నీ కలువను
అయితే ఇప్పడు చాలమంది ఇండస్ట్రీ ప్రముఖులు ‘టాక్సీ వాలా’ హోమ్ దియేటర్స్ లో అడుగుతున్న పరిస్తుతులను బట్టి ఇది అంతా విజయ్ దేవర కొండ పై ఉన్న క్రేజ్ అనుకోవాలా లేకుంటే ఈ యంగ్ హీరో మూవీ టాక్ గురించి ముందుగా తెలుసుకోవాలి అన్న ఉత్సాహం అనుకోవాలా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో ‘టాక్సీవాలా’ ఫలితంలో తేడా వస్తే ఆ వార్త చాల ప్రమాదకరమైన వైరల్ గా మారి విజయ్ కెరియర్ కు కీడు చేసే ఆస్కారం చాల స్పష్టంగా కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: