తెలుగు, తమిళ భాషల్లో విల‌న్‌గా న‌టిస్తు మంచి పేరు సంపాదించాడు హరీష్ ఉత్తమన్.  తాజాగా హరీష్ ఉత్తమన్ తన ప్రియురాలు అమృత కళ్యాణ్‌పూర్‌‌ను పెళ్లాడారు.  నవంబర్ మొదటి వారంలోనే వీరి వివాహం రహస్యంగా కేవలం కొంత మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.  ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు సోషల్ మీడియాలో ఫోటోస్ లీక్ అయ్యాయి. తెలుగులో గౌరవం, పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణ గాడి వీర ప్రేమగాధ, మిస్టర్, దువ్వాడ జగన్నాధమ్, జై లవ కుశ, నా పేరు సూర్య  విలన్ గా నటించాడు  హరీష్ ఉత్తమన్.
పెళ్లి గురించి త్వరలోనే ప్రకటన
కేరళలోని గురువాయూర్ టెంపుల్‌లో నవంబర్ 6న వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి ప్రైవేట్ ఈవెంటుగా జరిగిన ఈ వేడుకకు హరీష్, అమృత కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నట్లు సమాచారం.  అయితే కొన్ని కారణాల వల్ల వివాహం మీడియాకు తెలియకుండా రహస్యంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.   
పెద్దల అంగీకారంతో వివాహం
హరీష్ ఉత్తమన్ పెళ్లి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమృత కళ్యాణ్‌పూర్‌, హరీష్ మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోంది.  ప్రస్తుతం హరీష్ ఉత్తమన్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారని సన్నిహితులు అంటున్నారు.  హరీష్ ఉత్తమన్ సినిమాల్లోకి రాకముందు పారమౌంట్ ఎయిర్ వేస్, బ్రిటిష్ ఏయిర్ వేస్‌లో క్యాబిన్ క్రూ జాబ్ చేశారు.  2010లో ‘థా' అనే తమిళ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: