అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమౌళి సలహాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడం కూడ జరిగింది. అయితే ఈవిషయాల గురించి వార్తలు వచ్చాయి కానీ స్వయంగా ఎప్పుడు రాజమౌళి స్పందించలేదు. 
 ఆ ఆలోచన నాదే
ఈమధ్య జరిగిన ఒక సమావేశంలో రాజమౌళి ఈ విషయమై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. వాస్తవానికి అమరావతి విషయంలో తనకు సలహాలు ఇవ్వడడం ఇష్టం లేదని అందువల్ల తాను చంద్రబాబునాయుడు పిలుపును తప్పించుకుని 6 నెలలు తిరిగిన సందర్భాన్ని వివరించాడు రాజమౌళి.
చంద్రబాబుతో భేటీ
అయితే తాను ఎంత తప్పించుకుని తిరిగినా పట్టు వదలకుండా తన పై చంద్రబాబు విపరీతమైన ఒత్తిడి చేయడంతో ఆ ఒత్తిడిని తప్పించుకోలేక తాను చంద్రబాబునాయుడు దగ్గరకు వెళ్ళిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అమరావతి నిర్మాణం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతిలోని అసెంబ్లీ సెక్రటేరియట్ తదితర భవంతుల నిర్మాణం ఉండాలని చంద్రబాబు దేశవిదేశాల ఆర్కిటెక్ట్‌ లని సంప్రదిస్తూ తనను కూడ సలహాలు అడిగిన విషయాన్ని వివరిస్తూ రాజమౌళి రాజధాని డిజైన్స్ కోసం తాను చేసిన ప్రతిపాదనల్ని వివరించాడు.
నేను ఏం చేయగలను అని ఆలోచించా
వాస్తవానికి అమరావతి ప్లానింగ్ కమిటీలో క్రియేటివ్ పర్సన్స్ లేరు అన్న విషయాన్ని తెలియ చేస్తూ ముఖ్యమంత్రిగారికి లండన్ లో ఉన్న ఆర్కిటెక్ లకు మధ్య తాను ఒక వారధిలా పనిచేశాను కానీ తాను సూచించిన ఏడిజైన్ ఓకె కాలేదు అన్న కామెంట్స్ చేసాడు జక్కన్న. ముఖ్యంగా అమరావతి చరిత్రకు సంబంధించి ఒక కథ రూపంలో అంతర్లీనంగా బిల్డింగ్ డిజైనింగ్ గా ఇవ్వాలని తాను ప్రయత్నించినా ఆ బిల్డింగ్ లోపల తెలుగు తల్లి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మించాలని సూచించినా ఆవిషయాలు ఎంత వరకు అమలు జరుగుతాయో తనకు తెలియదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు రాజమౌళి..   



మరింత సమాచారం తెలుసుకోండి: