కొన్ని సంవత్సరాల క్రిత్రం వరకు టాప్ డైరెక్టర్స్ లిస్టులో కొనసాగిన దర్శకుడు వివి వినాయక్ అంటే కమర్షియల్ చిత్రాలకు చిరునామాగా కొనసాగిన నేపధ్యంలో ఇతడి సినిమాలలో నటించడానికి టాప్ హీరోలు అంతా విపరీతమైన ఆసక్తి కనపరిచేవారు.  హీరో ఇమేజ్‌కు తగ్గట్లుగా కమర్షియల్ అంశాలు జోడించి హిట్ కొట్టడంలో వివి వినాయక్‌ తీరు చాలామంది దర్శకులు అనుసరిస్తూ ఉండేవారు. 
జనసేన పార్టీ తరుపున
అయితే ప్రేక్షకుల అభిరుచి మారడంతో సినిమాలు తీసే విధానం కూడ మారింది. దీనితో ఈవిషయంలో వినాయక్ వెనకపడటంతో టాప్ డైరెక్టర్స్ లిస్టులో వినాయక్ స్థానం కోల్పోయాడు. అయితే ఆతరువాత చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ తీసే అవకాసం వినాయక్ కు వచ్చి హిట్ కొట్టినా ఆ హిట్ క్రేజ్ అంతా చిరంజీవి ఖాతాలోకి వెళ్ళిపోయింది. 
పవర్ ఫుల్ చిత్రాలు
ఆతరువాత వినాయక్ తీసిన సినిమాలు ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ తో తీసిన ‘ఇంటలిజెంట్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో వినాయక్ పరిస్థితి మరింత అయోమయంగా మారిపోయింది. ఈ పరిస్థుతుల నేపధ్యంలోనే వినాయక్ నిర్మాత సి. కళ్యాణ్ బాలయ్యతో నిర్మించబోయే సినిమా పై చాల ఆశలు పెట్టుకున్నాడు.  
 చివరి చిత్రం
ఇలాంటి పరిస్థుతులలో ఇక తాను ప్రస్థుత సినిమాల ట్రెండ్ కు సరిపోను అన్న ఉద్దేశ్యంతో తన చివరి సినిమాగా బాలయ్యతో ఒక పవర్ ఫుల్ సినిమాను తీసి ఆ హిట్ తో తన కెరియర్ ముగించాలని వివి వినాయక్ ఆశ. అయితే బాలకృష్ణ అవును అనకుండా కాదు అనకుండా రోజులు గడుపుతున్న నేపధ్యంలో ఈమూవీ ప్రయత్నాలు పక్కకు పెట్టి వినాయక్ జనసేన పార్టీ తరుపున 2019 లో ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికలలోపు బాలయ్య చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు టాక్. దీనితో బాలయ్య వరం ఇస్తే వినాయక్ ఆఖరి సినిమా ఉంటుందని లేదంటే వినాయక్ రాజకీయ నాయకుడుగా మారి పోవడం ఖాయం అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: