తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలు అందించిన రాంగోపాల్ వర్మ తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నారు.  మొదటి నుంచి ఈ చిత్రంపై ఎన్నో విమర్శులు, కాంట్ర వర్సీలు నడుస్తూనే ఉన్నాయి.  తాజాగా ఈ చిత్రంపై దర్శక,నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.  రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో 'జీఎస్టీ' (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) సినిమాలో కంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ ఉంటుందని... ఈ విషయాన్ని ఓ టీవీ డిబేట్ లో స్వయంగా ఆయనే చెప్పారని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. 
Image result for producer kethireddy
ఈ విషయం లక్ష్మీపార్వతి దృష్టికి వచ్చిందా..ఒకవేళ వచ్చినా ఆమె మిన్నకున్నారా అన్న విషయం తనకు అర్థం కావడం లేదని అన్నారు.   లక్ష్మీపార్వతి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని సూచించారు. 'లక్ష్మీస్ వీరగ్రంధం' పేరుతో తాను చిత్రాన్ని నిర్మిస్తుంటే లక్ష్మీపార్వతి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తాను తీస్తున్న చిత్రంలో ఎవ్వరినీ కించ పర్చడం లేదని..అందరి మనోభావాలకు దగ్గరగా ఉండేలా వాస్తవాలు చూపిస్తానని అన్నారు. 
Image result for laxmi's veeragandham
అయితే వర్మతో లక్ష్మీపార్వతి ములాఖత్ అయినట్టున్నా రని... అందుకే అడల్ట్ కంటెంట్ ఉంటుందని వర్మ చెప్పినా, ఆమె మాట్లాడటం లేదని విమర్శించారు. ఇలాంటి సినిమాతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పారు.  యవ్వనంలో ఉన్న ఓ మహిళకు, వయసు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తికి మధ్య జరిగే ప్రేమే మా చిత్ర కథ అని తెలిపారు. లక్ష్మీపార్వతి ఇప్పటికైనా మేలుకోవాలని కోరారు. ఇలాంటి చిత్రాలు తీయడం వల్ల అంతరి ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని కేతిరెడ్డి అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: