నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన 2.0 ప్రమోషన్ మీట్ లో రజినీకాంత్ నోటివెంట వేదాంతం రావడం చాలామందిని చాలామందిని ఆశ్చర్య పరిచింది. వరసపెట్టి సినిమాలు చేస్తున్న రజినీకాంత్ సినిమాలు తరువాత ఏమి చేయబోతున్నారు అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రజినీకాంత్ విభిన్నమైన రీతిలో సమాధానం ఇచ్చాడు. 
2 గంటలపాటు లేటుగా
సినిమాలు తరువాత తాను ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువ కృషి చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దీనితో షాక్ అయిన మీడియా వర్గాలు తమిళనాడు రాజకీయాల గురించి ప్రస్తావించదానికి ప్రయత్నిస్తే ఆవిషయాలకు డైరెక్ట్ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న రజినీకాంత్ తీరు నిన్నటి ‘2.0’ మీడియా మీట్ లో హైలెట్. దీనితో మళ్ళీ రజినీకాంత్ రాజకీయాల నుంచి యూటర్న్ తీసుకోబోతున్నాడా అంటూ సందేహాలు వ్యక్తం అయ్యాయి. 
ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు
ఇక నిన్నటి మీడియా మీట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ ‘2.0’ ను కేవలం ఒక యాక్షన్ ఫిలింగా కాకుండా ప్రేక్షకులకు ఒక మెసేజ్ చెప్పే సినిమాగా పరిగణించాలని రజినీకాంత్ అభిప్రాయపడ్డాడు. అంతేకాదు తాను ఈసినిమా చిత్రీకరణ సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో తన డూప్ చేత కొన్ని సీన్స్ తీయించారు అని వస్తున్న వార్తలను రజినీకాంత్ ఖండించాడు. 
2.0 విజయంపై రజనీ
తన మేకప్ అదేవిధంగా కాస్ట్యూమ్స్ కోసం చాల గంటల తరబడి పట్టిన విషయాన్ని వివరిస్తూ తాను ఈసినిమా కోసం పడ్డ కష్టాన్ని వివరించాడు రజినీకాంత్. చెన్నై నుండి ఒక ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన రజినీకాంత్ శంకర్ ల రాక రెండు గంటలు ఆలస్యం ఆవడంతో అప్పటికే ఆమీడియా మీట్ లో రజినీకాంత్ కోసం ఎదురు చూస్తున్న మీడియా ప్రతినిదుల వద్దకు వెళ్ళి తన ఆలస్యానికి కారణం వివరించి సారీ చెప్పడం రజినీకాంత్ మంచితనానికి నిదర్శనం అంటూ మీడియా వర్గాలు కామెంట్స్ చేసుకున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: