ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ జరుగుతున్న నేపధ్యంలో ఆ షూటింగ్ విశేషాలను తెలుసుకోవడానికి ఇండస్ట్రీ వర్గాలతో పాటు జూనియర్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది. 
 మూడు కాళ్ల బంధం
ఈఫోటోలో జూనియర్ చరణ్ మరియు రాజమౌళిలతో కలిసి కేవలం తమ పాదాలు మాత్రమే కనిపించేలా ఒక ఫోటో తీసి షూటింగ్ స్పాట్ నుండి తన అభిమానుల కోసం షేర్ చేసాడు. తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ పఠాన్ దుస్తులు ధరించి గుబురు గెడ్డంలో కనిపించే సందర్భంలో అతడికి చరణ్ కి మధ్య ఒక రెయిన్ ఫైట్ ను రాజమౌళి ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
 మాడ్రన్ గెటప్‌లో రాంచరణ్
స్వాతంత్రం రాకముందు జరిగే ఈకథకు సంబంధించిన సన్నివేశాలలో జూనియర్ బ్రిటీష్ వారిని అదేవిధంగా అప్పటి ధనవంతులైన జమీందారులను దోచుకునే దొంగగా కనిపిస్తే బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే పోలీసు అధికారిగా చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. చరణ్ ఈ షూటింగ్ లో అలనాటి బ్రిటీష్ ఫ్యాషన్స్ కు సంబంధించిన మోడ్రన్ డ్రస్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
 రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి కీలక సన్నివేశంగా వచ్చే ఈ పవర్‌ ఫుల్ వాటర్ ఫైట్‌ను జక్కన్న భారీగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హైలెట్‌ గా నిలిచే సీన్లలో ఇది ఒకటిగా అని తెలుస్తోంది. కేవలం తమ లుక్స్ బయటపెట్టకుండా తమ ముగ్గురు కాళ్లను ఫొటో తీసి జూనియర్ ఎన్టీఆర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోకు 6 లక్షల లైక్స్ రావడం ఈమూవీ మ్యానియాకు నిదర్శనం..   



మరింత సమాచారం తెలుసుకోండి: