వరస పరాజయాలతో అనుకోని షాక్ కు గురి అయిన నాని తన తీరు మార్చుకుని ప్రస్తుతం ‘జెర్సీ’ అన్న ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో కూడిన మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో క్రికెటర్ గా నాని నటిస్తూ సహజత్వం కోసం ఒక కోచ్ ని పెట్టుకుని క్రికెట్ ఆటలోని కొన్ని ట్రిక్స్ ను కూడ నేర్చుకున్నాడు. 

ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ విడుదల డేట్ ను చాల ముందుగానే ప్రకటించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీని వచ్చే ఏడాది ఏప్రియల్ 19న విడుదల చేయబోతున్నట్లు నాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీనితో 2019 సంవత్సరం ఇంకా రాకుండానే నాని తన ‘జెర్సీ’ డేట్ ను ఇంత ముందుగా ఎందుకు ప్రకటించాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈమూవీ విజయం నాని కెరియర్ కు ఎంతో ఆవసరం కాబట్టి ఈమూవీతో మరో సినిమా పోటీ లేకుండా సోలో రిలీజ్ డేట్ కోసం నాని ఇంత ముందుగా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాని ముందు చూపుతో ఇప్పటి నుంచే వేస్తున్న ప్లాన్ బాగున్నా ఇదే నెలలో ఏప్రియల్ మొదటి వారంలో మహేష్ ‘మహర్షి’ రాబోతోంది.

దీనితో మహేష్ సినిమాకు తనకు కేవలం రెండు వారాలు మాత్రమే గ్యాప్ ఉండేలా చూసుకుని సమ్మర్ రేసులో తాను కూడ ఉన్నాను అన్న సంకేతాలు ఇస్తున్నాడు నాని. ఇదే సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ చిరంజీవి ‘సైరా’ ప్రభాస్ ‘సాహో’ లు విడుదల కాబోతున్నాయి. ఇంతమంది టాప్ హీరోల సినిమాల మధ్య నాని సమ్మర్ రేస్ కు తన ‘జెర్సీ’ ని కూడ దింపుతూ ఉండటంతో తాను కూడ టాప్ హీరోని అన్న సంకేతాలను నాని ఇస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి: