తెలుగు ఇండస్ట్రీలో నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్.  ఆ తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. తెలుగు ఇండస్ట్రీలో మెహ్రిన్ ని లక్కీ హీరోయిన్ అంటున్నారు. సాధారణంగా పెద్ద బ్యానర్ లో మూవీ ఛాన్స్ వస్తే..ఏ హీరోయిన్ అయినా మిస్ కాదు..కానీ ఇప్పుడు మెహ్రీన్ మెగా అల్లుడితో ఛాన్స్ నటించే ఛాన్స్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మిగిలింది. 
Image result for kalyan dev mega
తాజాగా పులి వాసు దర్శకత్వంలో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఒక సినిమా చేయనున్నాడు. మొదట ఈ చిత్రం కోసం సుధీర్ బాబు అనుకున్నారు. కొన్ని కారణాలవలన ఈ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా బుక్ కావ‌డంతో ఆమె వ‌ద్ద‌కు డేట్స్ కోసం చిత్ర యూనిట్ సంప్ర‌దింపులు జ‌రిపింది. అయితే హీరోగా సుధీర్ బాబు త‌ప్పుకోవ‌డంతో తాను కూడా త‌ప్పుకుంటున్నాన‌ని చెప్పి, తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చి వేసినట్లు సమాచారం. 

Image result for sudheer babu

ఇదిలా ఉంటే..మెహ్రీన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది హాట్ టాపిక్ గా మారింది. పెద్ద ఆఫర్ రావడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆమె చేసిన 'ఎఫ్ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: