తెలుగు బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త్’కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.  భారత దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు ‘జబర్ధస్త్’ ప్రోగ్రామ్ వస్తుందీ అంటే చాలు టీవిలకు అతుక్కు పోతుంటారు.  ఇంత పాపులారిటీ సంపాదించిన ప్రోగ్రామ్ కావడంతో ఇందులో నటించిన నటులకు వెండి తెరపై ఛాన్సులు వస్తున్నాయి.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జబర్ధస్త్ టీమ్ సభ్యులు కామెడీతో అలరిస్తున్నారు.  వేణు, ధన్ రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, గెటప్ శీను, సుడిగాలి సుధీ ఇలా చాలా మంది వెండి తెరపై తమ సత్తా చాటుతున్నారు. 
Image result for mukku avinash
అయితే జబర్దస్త్ పై కామెడీతో పాటు అప్పుడప్పుడు కాంట్ర వర్సీలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నటులలో 'ముక్కు' అవినాష్ ఒకరు. తన టీమ్ కి లీడర్ గా వ్యవహరిస్తూ ఆయన తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు.  ఈ మద్య అవినాష్ చేసిన ఓ స్కిట్ స్కిట్ పై జగిత్యాల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. జరిగిన పొరపాటుకు ఆయన అప్పుడే సారీ కూడా చెప్పేశాడు.

తాజాగా ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ..తాను ఆ స్కిట్ చేయడం తప్పైందని అందరికీ జబర్ధస్త్ వేదిక పై, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పానని..కానీ ఇప్పటికీ  సోషల్ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నన్నే కాకుండా మా అమ్మను .. వదినను కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఈ టార్చర్ ను నేను తట్టుకోలేకపోతున్నాను.  దయచేసి ఈ విషయంపై నన్ను క్షమించి వదిలేయండి బయ్యా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: