ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే. సినీ నేపథ్యంలో  నాగ్ అశ్వన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’అద్బుతమైన విజయం సాధించింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.  ప్రస్తుతం మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్ర నిర్మాణం జరుగుతుంది.  ఈ చిత్రం షూటింగ్ హైదరాద్ లో షరవేగంగా జరుగుతుంది.

ఇక రాజకీయ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా శ్రీకాంత్ హీరో గా ‘తెలంగాణ దేవుడు’తెరకెక్కుతుంది. ఇది కేసీఆర్ బయోపిక్ అని అఫీషియల్ చెప్పకపోయినా అందరికి ఈజీగా అర్ధమవుతోంది. శ్రీకాంత్ కేసీఆర్ పాత్రలో కనిపిస్తున్నారు.  ఈ చిత్రంలో హీరో పేరు విజయ్ దేవ్ మార్చారు.  ఈ చిత్రంలో కేసీఆర్ బాల్యం మొదలుకొని రాజకీయ అడుగులు అలాగే తెలంగాణ ఆవిర్భావం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వరకు అన్ని అంశాలను చూపించినట్లు తెలుస్తోంది. 
Image result for తెలంగాణ దేవుడు
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ 6 నిమిషాల 3 సెకన్లు ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

పోసాని-తనికెళ్ళ భరణి- సుమన్ - అజయ్ - బ్రహ్మానందం - సంగీత ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హరీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. మరి ఈ చిత్రం శ్రీకాంత్ కి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: