2011 లో రామ్ హాన్సికలు ‘కందిరీగ’ సినిమాలో నటించిన తరువాత వారిద్దరూ కలిసి నటించిన సినిమాలు లేవు. ఆసినిమా విజయం సాధించినా రామ్ హాన్సికల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాలేదు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం వీరిద్దరూ చాల సాన్నిహిత్యంగా ఉంటూ డేటింగ్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిప్పులు చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

వాస్తవానికి హాన్సిక కోలీవుడ్ లో తన టాప్ హీరోయిన్ స్టేటస్ కోల్పోయింది. అదేవిధంగా ప్రస్తుతం రామ్ పరాజయాల బాటలో పయనిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు గుప్పు మంటున్నాయి. 

గతంలో హాన్సిక హీరో శింభుతో ప్రేమ వ్యవహారం నడిపి ఆతరువాత ఆప్రేమ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం హాన్సిక ఆ ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంది. ఈమధ్య కాలంలో కోలీవుడ్ లో నయనతార హవా పెరిగిపోయిన తరువాత హాన్సికకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 

puri fans; tolllywoood;దీనికితోడు యంగ్ హీరోయిన్స్ క్రేజ్ కూడ బాగా పెరిగిపోవడంతో హాన్సికకు కోలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో హాన్సిక రామ్ ల ప్రేమాయణం ఇప్పుడు బయటపడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది అంతా రూమర్స్ అనీ కేవలం హన్సిక టాలీవుడ్ లో తిరిగి అవకాశాలు వెతుకుకునే ప్రయత్నంలో తిరిగి రామ్ తో క్లోజ్ గా ఉంటున్న పరిస్థుతుల వల్ల ఇలాంటి గాసిప్పులు ఇండస్ట్రీలో వస్తున్నాయి అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: