దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న RRR సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ.. ఈ సినిమా వివరాలు మాత్రం ఇంకా బయటకు రావడం లేదు. ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Image result for rrr rajamouli ntr. ఈ ఏరియాలో ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ సినిమా షూటింగ్ కు వెళ్తున్న ఎన్టీఆర్ చిత్రం ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ సినిమా అరవింద సమేతలో ఎన్టీఆర్ నాజూకుగా సిక్స్ ప్యాక్ తో నటించిన సంగతి తెలిసిందే. కానీ RRR సినిమా కోసం ఎన్టీఆర్ తనను తాను మార్చుకున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు పెరిగినట్టు ఈ పిక్ ద్వారా తెలుస్తోంది. కాస్త బొద్దుగా, గడ్డంతో వైట్ షర్ట్ లో ఉన్న ఎన్టీఆర్ పిక్ చూస్తుంటే.. చాలా బరువైన పాత్ర పోషిస్తున్న కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: